అయితే పిల్లలు కనడానికి అనువైన వయసు 18 నుంచి 24 సంవత్సరాలని సూచిస్తున్నారు. పెళ్ళి ఆలస్యం అయ్యేకొద్దీ గర్భం దాల్చే అవకాశాలు తగ్గిపోతాయట. 25 సంవత్సరాలు దాటిన తర్వాత గర్భం దాల్చే అవకాశం తక్కువ. అంతేకాకుండా ఒక సర్వే ప్రకారం 25 నుంచి 31 సంవత్సరాల మధ్య వయసు గల వివాహితకు గర్భం దాల్చే అవకాశం 26 శాతానికి పడిపోతుంది. 31 నుంచి 35 సంవత్సారాల లోపు వారికి 38 శాతానికి పడిపోతుంది. 18 నుంచి 24 ఏళ్ళ లోపు వివాహితులకు పుట్టిన బిడ్డలు ఆరోగ్యంగా, మంచి బరువుతో పుడతారు.
ఇక 27 సంవత్సరాలు దాటితే, బిడ్డ బరువులో చాలా తేడాలుంటాయట. కృత్రిమ గర్భం కోసం ప్రయత్నించేవారు ఎక్కువ మంది 35 ఏళ్ళ వయసు దాటిన వారే ఉంటారు. పురుషుడి వయసు పెరుగుతున్నకొద్దీ వారిలో శుక్రకణాల ఉత్పత్తి తగ్గిపోతుందట. పైగా అండ ఉత్పత్తి కూడా క్షీణిస్తూ, హార్మోన్లలో మార్పులు సంభవిస్తాయి. అండకోశాలు అండాన్ని హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంటాయి. అండాలు ఒక్కొక్కటి ద్రాక్ష కాయంత పరిమాణంలో ఉంటాయి. సుమారుగా ఒక అంగుళం నుంచి ఒటికన్నర అంగుళం పొడవు, వెడల్పు కలిగి ఉంటుంది.
అంతేకాక గర్భ సంచి మూడు అంగుళాల పొడవు, రెండు అంగుళాల వెడల్పు ఉంటుంది. ఇది కండరాలతో నిర్మితమై ఉంటుంది. దీనిపై పొరను మయోమెట్రియం అంటారు. గర్భాశయం లోపల ప్రత్యేకమైన పొర ఉంటుంది. దీన్ని ఎండోమెట్రియం అంటారు. గర్భం కలిగితే, గర్భస్థ పిండం ఫెలోపియన్ నాళం గుండా ప్రయాణించి ఎండోమెట్రియంలో నాటుకుంటుంది. అక్కడి ఆహారాన్ని తీసుకుంటూ గర్భస్థ పిండం తొలినాళ్ళలో పెరుగుతుంది. వయసు పెరిగే కొద్ది గర్భధారణకు అనుమైన ఈ పరిస్థితుల్లో మార్పు వస్తుంది. అందుకే పెళ్ళికి తొందర పడాల్సిందే అని నిపుణులు అంటున్నారు.