నాకు తెలుసు నా బిడ్డ బతుకుతుందని. వేరే వాళ్ళు నా కూతురి గురించి ఎమన్నా నేను పట్టించుకోను. నాకు నా కూతురు బతకడమే ముఖ్యం. నాకు పెళ్ళై పదేళ్ల తర్వాత కూతరు పుట్టింది. అది కూడా తొమ్మిది నెలలకు ముందే డెలివరీ అయ్యింది. దీంతో బిడ్డ బతకదని, ఆమె నుండి దూరంగా ఉండాలని చాలా మంది అన్నారు. తక్కువ నెలలకే డెలివరీ కాగా ఆమె వీక్ గా పుట్టడంతో చాలా మంది బిడ్డ బతకదు నీ కళ్ల ముందే ఆమె చనిపోవడం చూస్తే నిన్ను ఇంకా మాససికంగా కృంగదీస్తుందని అది నీ జీవితానికి పెద్ద ఎదురు దెబ్బ కావచ్చని చాలా మంది ఆమెను హెచ్చరించారు. కానీ ఆమె మాత్రం వాళ్ళ మాటలేమి పట్టించుకోకుండా తన బిడ్డ బతుకుతుందని నేను బతికించుకుంటానని వాళ్ళతో గట్టిగా వాదించి ఆ ప్రాంతం నుండి భర్త తో కలిసి వేరే చోటుకి వెళ్ళిపోయింది.

బిడ్డను రక్షించుకోవడం కోసం ఏమి చేయడానికైనా సిద్ధమని భర్త నాతో చెప్పాడు. ఆ విషయం తనకి ఎంతో ధైర్యాన్ని ఇవ్వగా కొన్ని నెలల పాటు ఇద్దరు వాళ్ళ బిడ్డ కోసం నిద్ర లేని రాత్రుళ్ళు గడిపారు. ఎల్లప్పుడూ ఆమె ఆరోగ్యం గురించే శ్రద్ద చూపేవారు. ఇలా ఉండగా ఒక రోజు రాత్రి వాళ్ళ కూతురికి ఉపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారింది. వెంటనే ఆ తల్లి దేవుణ్ణి ప్రార్తించడం మొదలుపెట్టింది. తన బిడ్డని దూరం చేయవద్దు అని పడే పడే వేడుకుంది. అయినా కూడా ఆమె కూతురి ఆరోగ్యం మరింత క్షీణించింది. బిడ్డ ఆరోగ్యం కోసం తన భర్త తనకున్న రిక్షాని కూడా అమ్మేశాడు. బిడ్డ క్షేమం కోసం తల్లి  పడే ఆరాటం అప్పుడు  నాకు నా భార్య ముఖం లో కనిపించింది. లోకంలో ప్రతి తల్లి బిడ్డ ఆరోగ్యం కోసం ఇంతలా ఆలోచిస్తోందా అనే విషయం అప్పుడు నాకు అర్థం అయ్యింది.  

దేవుడు కరుణించాడు. నా బిడ్డను రక్షించాడు. ఇప్పుడు మా కళ్ల ముందు ఆమె సంతోషంగా ఉండడం చూస్తే, మేము అప్పుడు  పడ్డ కష్టం ఆమె సంతోషం ముందు ఆవిరైపోయాయి. ఆమెకు చాందిని అని పేరు పెట్టాము. ఆమె ఇప్పుడు  ఆరోగ్యంగా ఉంది. ఆమె ముఖంలో నుండి వచ్చే సంతోషమే మమల్ని ఇంకా బతికేలా చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: