మహిళలు గర్భం దాల్చినప్పుడు మహిళలు చాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మహిళలు గర్భం దాల్చినప్పుడు వ్యాయామం చేయడం మంచిదే. తక్కువ ప్రభావం కలిగిన శారీరక కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల వెన్ను నొప్పి, కండరాల నొప్పి నుంచి ఉపశమనంతో పాటు మానసిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాయామం చేయడం వల్ల ప్రసవం సమయంలో ఇబ్బందులు తలెత్తవు. పుట్టబోయే బిడ్డ కూడా ఎలాంటి సమస్యలు లేకుండా ఆరోగ్యవంతంగా ఉంటాడు.

ఇక ఒకవేళ మీ బిడ్డ 37 వారాలకు ముందే పుట్టినట్లయితే ఆ డెలివరీని ప్రి మెచ్యుర్ డెలివరీ అని కూడా అంటారు. అలాంటి సమయంలో శారీరకంగా కష్టపడే ఎలాంటి వ్యాయామాలను చేయకూడదు. ఒకవేళ 20 వారాల నుంచి 37 వారాలకు ముందు ప్రసవం కనుక జరిగితే మహిళలకు మరింత విశ్రాంతి అవసరమవుతుంది. గర్భస్రావం చరిత్ర ఉన్న మహిళలు లేదా ప్రస్తుతం గర్భధారణ సమయంలో రక్తస్రావం జరిగినట్లు గమనిస్తే అలాంటి మహిళలు తొమ్మిది నెలల పాటు తప్పనిసరిగా అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భస్రావం సమస్య తలెత్తకుండా ఉండటానికి గర్భం దాల్చిన మొదటి 12 వారాల పాటు వ్యాయామం చేయకుండా ఉండాలి. ఒకవేళ వ్యాయామం చేయాలనుకుంటే వైద్యుడిని సంప్రదించి సలహాలను పొందాలి.

అయితే గర్భాశయ సమస్యలు (ప్లాసెంటా) ఉన్న మహిళలు కఠినమైన పనులు చేసినా లేదా వ్యాయామం చేసినా అది రక్తస్రావానికి దారితీస్తుంది. కాబట్టి వారు వ్యాయామం చేయకపోవడమే మంచిది. గర్భాశయ సంబంధ సమస్య ఉన్న మహిళలు గర్భం దాల్చిన మొదటి మూడు నెలలు అదనపు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది. గర్భం దాల్చిన మహిళలు పూర్తిగా ఆరోగ్యంగా ఉంటేనే వ్యాయామాలు చేయడం చాలా ఉత్తమం. లేదంటే అదనపు సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. గర్భిణీ మహిళలు స్విమ్మింగ్, చురుకైన నడక, సైక్లింగ్ వంటి తక్కువ శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం ఎంతో శ్రేయస్కారం. ముఖ్యంగా నాలుగో నెల దాటిన గర్భిణీలు నేలపై ఫ్లాట్‌గా పడుకోవడం మంచిది కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: