పిల్లలకు చిన్నప్పటినుంచే సంస్కారం నేర్పకపోతే పెద్ద పెరిగిన తర్వాత వారు చెడు దారులకు వెళ్లే ప్రమాదముంటుంది. సమాజంలో మంచి కొడుకుగా , కూతురుగా తీర్చిదిద్దాలని ఏతల్లి తండ్రులకు ఉండదు చెప్పండి. అందుకే వారిని చిన్నప్పటినుంచే అన్ని రకాల బుద్ధులు నేర్పించి పెద్ద ప్రయోజకులని చేయాలనీ తల్లిదండ్రులు ఆశపడుతుంటారు. అయితే ఓ చిన్నారిఅడిగిన ప్రశ్నకు ఆతల్లి చెప్పిన సమాధానం చూసి అక్కడున్న వారే కాదు మొత్తం ఈవిషయం తెలిసిన వారు కూడా ఆ తల్లి కి హ్యాట్స్ అఫ్ చెప్తున్నారు.

ఓ సారి ఓ తల్లి తన కూతురు తో పాటు కారులో వెళ్తుంది.. అది క్యాబ్ కావడంతో అందులో వేరే ప్రయాణికుడు కూడా ఉన్నాడు. అతను మొదటినుంచి ఆ తల్లి కూతుళ్లను గమనిస్తూనే ఉన్నాడు.. ఆ వ్యక్తి తలకు టోపీ పెట్టుకుని ఉన్నాడు. అంటే అతను ముస్లిం అని తన హవాభావలతోనే గుర్తుపట్టేయోచ్చు.. అతన్ని కొద్ది సేపు గమనించిన పాప చివరికి అతను ఎందుకు అలా టోపీ పెట్టుకున్నాడు అని అడిగింది ఆ పాప.. ఆ క్యాబ్ డ్రైవర్,  కూర్చున్న ముస్లిం వ్యక్తి ఆ తల్లి ఏం చెప్తుందా అన్నట్లు ఎదురు చూస్తున్నారు..

నార్మల్ గా అయితే అయన ముస్లిం అందుకే అలా టోపి పెట్టుకున్నాడు, మనం హిందువులం అందుకే మనం టోపీ పెట్టుకోలేదు అని చెప్తాం.. అలా చెప్పడం వల్ల మనుషులు రెండు రకాలుగా ఉంటారు అనే విషయం పిల్లలకు అర్థమై వారిని వేరే విధంగా చూసే ప్రమాదం ఉంది. కనీ ఆ తల్లి ఏం చెప్పిందంటే నేను ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే ఎలాగైతే కొంగు తలకు చుట్టుకుని గౌరవిస్తానో అలానే అయన కూడా టోపీ తో గౌరవిస్తున్నాడు అని చెప్పింది..ఆ పాప అలోచించి మరీ ఇక్కడ ఆయనకన్నా పెద్దవాళ్ళు ఎవరు లేరు కదా అని అడిగితే వాళ్ళ అమ్మ కనపడిన కొత్తవాళ్ళని అందరిని అలా గౌరవించమని చెప్పిందేమో అని చెప్పింది.. నిజంగా ఆ సమాధానానికి ఎవరైనా హ్యాట్స్ ఆఫ్ అనాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: