అమీర్ ఖాన్ నటించిన త్రీ ఇడియట్స్ సినిమాలో లాగా హీరోయిన్ అక్క కాంతితో ఉంటే వర్షం పడిన రాత్రి ఆమెకు నొప్పులు బాగా హీరో ఎంతో రిస్క్ చేసి మరీ ఆమెకు ప్రసవం చేస్తాడు.. ఇలాంటి సంఘటనే నిజజీవితంలో కూడా జరుగుతుందా అని అప్పుడు అనుకున్నారు కానీ అది చేసి చూపించింది ఓ మహిళ.. వివరాల్లోకి వెళితే కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఈ సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది మైసూర్ అన్నంబిరా ఏ ఎస్ ఐ ప్రకాష్ భార్య శోభా కుమారి ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గ ఉద్యోగం చేస్తున్నారు..
కొడగు లోని గోని కోప్పల్ సమీపంలోని ఒక గిరిజన గ్రామంలో నివాసం ఉండే మల్లిగే అనే తొమ్మిది నెలల గర్భిణి వైద్యం కోసం ఇద్దరు పిల్లలతో కలిసి సోమవారం పేట మండల కార్యాలయం వద్దకు రాగానే ఆమె పురిటి నొప్పులు మొదలయ్యాయి.. దీంతో ఆమె తట్టుకోలేక పబ్లిక్ పార్క్ లోకి వెళ్లి కేకలు వేసింది.. అదే పాకు కు ఎదురుగా కిరణా షాప్ వచ్చిన స్థానికులు కొందరు ఆమె ను చూసి, పోలీసులకు మరియు అంబులెన్స్ కు సమాచారం ఇవ్వగా అదే దారిలో విధులు ముగించుకుని వెళుతున్న శోభ ప్రకాష్ ఈ ఘటనను గమనించి ఆగింది .. సాయం చేయాలని అక్కడి స్థానికులు విజ్ఞప్తి చేయగా అక్కడున్న ఒక వ్యక్తి తన స్నేహితుడు తన డాక్టర్ అని చెప్పాడు.. ఫోన్ లో డెలివరీ ఎలా చేయాలో చెబుతారని మీరు చేస్తారా అని అడగగా కంగారు పడుతు చేస్తా అని చెప్పింది.. ఫోన్ లో డెలివరీ క్లియర్ గా చెప్పడం తో ఈ పని చేశారు.. ఆ తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లడం జరిగింది ..