అయితే కుట్లు మీద ఎటువంటి ఒత్తిడి పడినా మంచిది కాదు. కానీ మలబద్ధకం ఉంటే అక్కడ ఒత్తిడి పడకుండా ఉండదు. కాబట్టి మలబద్ధకం లేకుండా చూసుకోండి. సమస్య రాకుండా ఉండడం కోసం పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే వీలైనంత ఎక్కువ నీరు తాగాలి. చిన్నపాటి కేగల్ ఎక్సెర్సైజెస్ చేయడం ద్వారా రక్త ప్రవాహం పెరిగి కుట్లు త్వరగా మానిపోతాయి. ఈ ఎక్సెర్సైజెస్ ద్వారా మూత్రం అదుపు తప్పే సమస్య కూడా తగ్గిపోతుంది. కానీ మీరు ఏది చేయాలనుకున్న కూడా దానిమీద డాక్టర్ సలహాలు కూడా తీసుకోవడం మంచిది. డెలివరీ తర్వాత స్త్రీ కి మానసిక ప్రశాంతత చాలా అవసరం అని గుర్తు పెట్టుకోండి.
ఇక చక్కని విశ్రాంతి తీసుకోవడం వల్ల, కాన్పు తర్వాత కలిగే అలసట తగ్గడం తో పాటు పాలు బాగా పడతాయి. సాధారణ కాన్పు తర్వాత వీలైనంత త్వరగా లేచి తిరగడాన్ని, ఆపరేషన్ అయితే డాక్టర్లు చెప్పిన సమయం తర్వాత తల్లి తనంతట తాను లేచి తిరగడానికి ప్రయత్నం చేయాలి. అలా లేచి తిరగడం వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా, రక్తప్రసరణకు ఆటంకం కలగకుండా ఉంటుంది. డెలివరీ తర్వాత గంటలోగా బిడ్డకు తల్లి రొమ్ము ను శుభ్రం చేసి బిడ్డకు పాలు పట్టించాలి. బిడ్డ ఎంత త్వరగా రొమ్ము ను అందుకుంటే అంత త్వరగా పాలు రావడం మొదలవుతుంది. ఆరు నెలల పాటు తల్లిపాలు ఇవ్వడం తల్లికి, బిడ్డకు మంచిది అని మరువకండి.