ఆమె పేరు అంబిక.. 14 ఏళ్లకే పెళ్లి అయింది.. 18 ఏళ్లకే ఇద్దరు పిల్లల తల్లి.. ఆమె భర్త ఓ కానిస్టేబుల్ .. దుందిగల్ పోలీస్ స్టేషన్ లో పని చేస్తాడు. అయితే ఓ సారి తన భర్త తన పై ఆఫీసర్లకు సెల్యూట్ కొట్టడం చూసి ఆశ్చర్య పోయింది.. ఏంటి మీరు సెల్యూట్ చేస్తున్నారు అని అడిగింది.. నా పై ఆఫీసర్లకు సెల్యూట్ చేయడం నాకు కర్తవ్యం అని చెప్పాడు.. అయితే అప్పుడు ఆమె నేను కూడా మీ పై ఆఫీసర్ల లా అవుతానని చెప్పింది.. భర్త నవ్వుకుని ముందు నువ్వు నీ పదవ తరగతి పాస్ అవ్వు అని సలహా ఇచ్చాడు..
భర్త మాటలు పట్టించుకోని ఆమె మొదట పదో తరగతి తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ చకచకా పూర్తి చేసి భర్తను ఆశ్చర్యపరిచింది.. భర్త సహకారం కూడా తోడవడంతో ఆమె ఐఏఎస్ దాకా వెళ్ళగలిగింది.. పిల్లల బాధ్యత తాను చూసుకుంటూ ఐఏఎస్ ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టింది.. అయితే తొలి మూడు సార్లు ఆమె కు అదృష్టం కలిసి రాలేదు.. నార్మల్ గా అయితే మూడు సార్లు తప్పం అని తెలిశాక ఎవరు నాలుగుసార్లు చేయడానికి సాహసం చేయరు. కానీ అంబికా చేసిన ఈ సాహసమే ఆమెను ఇప్పుడు ఐపీఎస్ గా మార్చింది.. నిజంగా పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించింది..