ప్రతి మహిళ ఆడపిల్లకు జన్మనివ్వాలని ఎన్నో కలలు కంటుంది. ఇక ఇంటిలో ఆడవారు గర్భంతో ఉన్నప్పుడు తమ కుటుంబం లో పాప పుడుతుందా బాబు పుడతాడ అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తూనే ఉంటారు. అయితే కొన్ని సంకేతాల ద్వారా పుట్టబోయేది పాపా , బాబో సులభంగా తెలుసుకోవచ్చు అంటున్నారు మన పెద్దలు. కొన్ని సంవత్సరాలగా మన పెద్దలు అనుసరిస్తున్న విధానంలో పుట్టబోయేది ఎవరో తెలుసుకోండి.

అయితే సాధారణంగా ప్రగ్నెంట్ గా  ఉన్నప్పుడు వికారం, వాంతులు రావడం చాలా సహజం. కానీ ప్రతిరోజూ ఉదయం మరింత ఎక్కువ వికారం ఉంటే అమ్మాయి పెట్టబోతున్నట్లు, అదే నార్మల్ గా ఉంటే అబ్బాయి పుట్టబోతున్నట్లు  తెలియచేసే  సంకేతం ఇది .ప్రెగ్నెంట్ గా ఉన్న స్త్రీల తల వెంట్రుకలు దృఢంగా, శక్తివంతంగా ఉంటే బాబు అని, అదే జుట్టు రాలిపోతూ బలహీనంగా ఉంటే పాప పుడుతుంది అని పెద్దవాళ్లు చెబుతూ ఉంటారు. పుట్టబోయేది అబ్బాయా అమ్మాయా అని తీసుకునే ఆహారం కూడా తెలియచేస్తుంది. ఇక గర్భధారణ సమయంలో పుల్లగా,ఉప్పగా, కారం ఎక్కువగా ఉండే ఆహారాలు తింటే ఉన్నట్లయితే బాబు పుడతారని అంటారు. అదే స్వీట్, చాక్లెట్, డైరీ ప్రొడక్ట్స్, జ్యూస్ లు ఎక్కువగా తీసుకుంటే అమ్మాయి పెట్టబోతున్నట్లు పెద్దవాళ్ళు చెబుతారు.

ఇక ప్రెగ్నెంట్ గా ఉన్న స్త్రీ చర్మం రంగును బట్టి కూడా పుట్టబోయేది ఎవరో తెలుసుకోవచ్చు అని మన పెద్దలు తెలియచేస్తున్నారు. చర్మం నలుపు రంగు కంటే ఎక్కువ ముదురు రంగులోకి  మారుతూ ఉంటే అబ్బాయి పెట్టబోతున్నట్లు చెబుతుంటారు. అదే చర్మం రంగులో ఎటువంటి మార్పులు జరగకపోతే అమ్మాయి పుడుతున్నట్టు సూచన.  ప్రెగ్నెన్సీ సమయంలో ఎప్పుడు ఎడమవైపు పడుకోవడానికి ఆసక్తి గా ఉన్నట్లయితే..  అబ్బాయి మీ ఇంట్లోకి వస్తున్నాడని, అదే కుడివైపు తిరిగి పడుకోవడానికి ఇష్టం గా ఉంటే పాప మీ ఇంట్లోకి రాబోతుందని అందుకు అవి గుర్తులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: