అమ్మతనం ఎంతో గొప్పదైనది. తల్లి కాబోతున్నానని తెలిసిన క్షణం నుంచి బిడ్డను ప్రసవించే వరకు ఎన్నో రకాల సమస్యలతో సావాసం చేస్తుంది. అందులో ఒకటి మార్నింగ్ సిక్‌నెస్. ఉదయం పూట గర్భిణులకు వికారం ఎక్కువగా అనిపిస్తది. అయితే ఇది ఎందుకు జరుగుతుందనే విషయంపై పరిశోధకులు పరిశోధన నిర్వహించారు. అయితే సమస్య వల్ల గర్భిణులకు నష్టం కంటే.. లాభమే ఉందని వారు గుర్తించారు. మార్నింగ్ సిక్‌నెస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.



గర్భవతిగా ఉన్నప్పుడు వాంతులు, వికారంతో కూడిన సమస్య తలెత్తుంది. దీనికే మార్నింగ్ సిక్‌నెస్ అంటారు. అయితే ఈ సమస్య సాధారణంగా పగటి పూట ప్రారంభం అవుతుంది. సమయం గడిచే కొద్ది సమస్య సర్దుమణుగుతూ వస్తుంది. ఈ సమస్య 80 శాతం గర్భిణుల్లో ఉంటుంది. అయితే ఇప్పటికీ ఎవరికీ ఈ సమస్య వస్తుందనే క్లారిటీ లేదు. గర్భధారణ సమయంలో తల్లి శరీరంలో హార్మోన్లల్లో వచ్చే మార్పుల కారణంగా మార్నింగ్ సిక్‌నెస్ వస్తుందని పరిశోధకులు గుర్తించారు.



ఈ మార్నింగ్ సిక్‌నెస్ వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు. వికారం, వాంతులు వస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. మనసులో ఏదో అలజడి ఉంటుంది. ఏ పనులు చేసినా పెద్ద అడ్డంకిగా ఏర్పడుతుంది. ఈ సమస్య తీరడానికి మెడిసిన్స్ వాడాలి. అప్పుడే సమస్యను కొంతమేర తగ్గించవచ్చు. అయితే మార్నింగ్ సిక్‌నెస్ వల్ల సమస్య ఉన్నా.. దీని వల్ల గర్భిణులకు మేలు జరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇటీవల జరిపిన పరిశోధనల్లో 797 గర్భిణులపై పరిశోధన నిర్వహించారు. వారందరినీ 2 నెల నుంచి 8 నెల వరకు డైరీలు రాయమన్నారు. అందులో ఆరోగ్య సమస్యల గురించి రాయమని చెప్పారు.



అయితే వారు రాసిన డైరీల ప్రకారం 797 మందిలో 60 శాతం మంది మార్నింగ్ సిక్‌నెస్ సమస్యతో బాధ పడుతున్నట్లు గుర్తించారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. వీరిలో గర్భస్రావం మాత్రం చాలా తక్కువ మందికి నమోదైనట్లు వెల్లడించారు. మార్నింగ్ సిక్‌నెస్ సమస్యతో బాధపడేవారిలో గర్భస్రావం అయ్యే ప్రమాదం దాదాపు 75 శాతం తక్కువగా నమోదైనట్లు తెలిపారు. గర్భిణులు ఆహారం తీసుకున్నప్పుడు రకరకాల సూక్ష్మక్రిములు శరీరంలో ప్రవేశిస్తాయి. ఇవి శిశువుకి హాని చేకూర్చే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదం నుంచి బిడ్డను కాపాడుకోవడానికి శరీరంలో జరిగే ప్రక్రియ వల్ల మార్నింగ్ సిక్‌నెస్ ఏర్పడుతుందని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: