మొగల్ సామ్రాజ్యం లో అత్యంత శక్తివంతమైన మహారాణిగా నూర్జహాన్ పేరుగాంచింది.. పర్షియా దేశానికి చెందిన ఈమె అప్పట్లో ఈమె అందానికి ముగ్దులు అవనివారు లేరట.. కేవలం అందం లోనే కాదు తెలివి తేటలకు మంచి గుర్తింపు పొందింది నూర్జహాన్.. అందుకే కాబోలు ఆమెని బ్యూటీ విత్ బ్రెయిన్ అని పిలుస్తారు అప్పటి విజ్ఞానవంతులు.. ఈమె అసలు పేరు మెహర్ ఉన్ నిస.. 17 ఏళ్ల వయసులోనే పర్షియా రాజు షేర్ ఆఫ్ఘన్ (అలీ కులి) ను వివాహం చేసుకుంది.. 

వారికి ఓ కుమార్తె కూడా పుట్టింది..  ఆమెకు లాడ్లీ బేగం అనే పేరు పెట్టారు.. అయితే ఆమె భర్తను జహంగీర్ చంపేస్తాడు..జహంగీర్ సోదరుడు కుతుబుద్దీన్ కోకాను అలీ కులీ చంపినందుకు గానూ  అతడిని జహంగీర్ చంపి ప్రతీకారం తీసుకుంటాడు.. ఆ తరువాత అలీ కులి భార్య గా ఉన్న నూర్జహాన్ అగ్రా కి వస్తుంది.. అక్కడ అక్బర్ భార్య మహారాణి రుకామయి సుల్తాన్ బేగం కొలువులో పని చేస్తుంటుంది..  సుల్తాన్ బేగం సలీం కు సవతి తల్లి అవుతుంది.. నూర్జహాన్ మహారాణి తో అత్యంత సన్నిహితంగా మెలుగుతుంది.. నూర్జహాన్ కి కూడా మహారాణి అంటే ఇష్టం ఉండేది.. నూర్జహాన్ ను మహారాణిలా చూసుకునేది రుకమయి..

ఒకరోజు మీనా బజార్ లో ఉన్న నూర్జహాన్ ని చూస్తాడు జహంగీర్.. వెంటనే ఆమె వద్దకు వెళ్లి తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా కోరారు.. నూర్జహాన్ సరే చెప్తుంది.. రుకమాయి కూడా సమ్మతిస్తుంది.. ఆ తర్వాత పదహారు వందల ఇరవై వ సంవత్సరంలో ఆమె మొగల్ సామ్రాజ్యానికి మహారాణిని అయ్యింది.. మహారాణి అయ్యాక నూర్జహాన్ సామ్రాజ్యంపై సర్వ అధికారాలను పొంది అన్ని నిర్ణయాలను తీసుకుంది.. ఆమె తీసుకున్న ఎన్నో సాహసోపేత నిర్ణయాల కు గాను ఆమెకు ఇంతటి పేరు వచ్చిందని చెప్పవచ్చు.. ఆమెకు ఆర్కిటెక్చర్ తో పాటు దుస్తులను డిజైన్ చేయడం అన్న, కొత్త డ్రెస్సులు డిజైన్ చేసి తయారు చేయడం అన్నా చాలా ఇష్టం.. అనేకమంది రాజకుటుంబీకులు ఆమె దగ్గర నుండి వివాహం జరిపించింది.. అందుకే ఆమె అత్యంత శక్తివంతమైన మహారాణిగా గుర్తింపు పొందింది..

మరింత సమాచారం తెలుసుకోండి: