

తమ కుమారుడి నోటి నుండి అమ్మ అనే పిలుపు కోసం ఆ తల్లి ఎంతగానో ఎదురు చూసింది. అయితే సంహిత్ వయసు పెరుగుతున్నా ఇంకా మాట్లాడకపోవడంతో ఇది కచ్చితంగా ఆరోగ్య సమస్యేనని గుర్తించిన శ్రీజ రెడ్డి దంపతులు ఎంతో మంది వైద్యులను సంప్రదించారు. అయినప్పటికి తమ కుమారుడికి ఉన్న సమస్యకు సరైన పరిష్కారం లభించలేదు. అయితే పలువురు వైద్యుల ద్వారా తమ కుమారుడు ఆటిజంతో భాదపడుతున్నట్లు గుర్తించారు. అయితే ఈ రకమైన సమస్యకు ఎలాంటి ట్రీట్మెంట్ లేదని హోమ్ థెరఫీ ఒక్కటే మార్గమని నిపుణులు చెప్పడంతో తమ కుమారుడికి హోమ్ థెరఫీ ఇవ్వడం మొదలు పెట్టారు. ఇక హోమ్ థెరఫీ ద్వారా తమ కుమారుడు మాట్లాడడం, సాధారణ స్థితికి రావడంతో శ్రీజ రెడ్డి దంపతుల ఆనందానికి అవధులు లేవు.


ఇక ప్రస్తుతం " పినాకిల్ బ్లూమ్స్ " సౌత్ ఇండియాలోనే నెంబర్ ఒన్ ఆటిజం థెరఫీ నెట్వర్క్ గా గుర్తింపు పొందింది. ఇక "పినాకిల్ బ్లూమ్స్ " సిఈఓ గా ఉన్న డాక్టర్ శ్రీజ రెడ్డి సరిపల్లి గారు చేస్తున్న సేవలను ప్రపంచ స్థాయి పత్రికలలో కూడా ప్రత్యేక వ్యాసాలు రచించడం పిల్లలపట్ల ఆమె చేస్తున్న విశేషమైన సేవలకు నిదర్శనం. నేడు "పినాకిల్ బ్లూమ్స్ " సిఈఓ శ్రీజ రెడ్డి సరిపల్లి గారి జన్మదినం.. ఆమె ఇలాగే ఎంతో మంది చిన్నారులకు అండగా నిలుస్తూ భావితరాలకు బాసటగా నిలవాలని కోరుకుంటూ శ్రీజ రెడ్డి సరిపల్లి గారికి జన్మదిన శుభాకాంక్షలు.
