కూల్ డ్రింక్‌లో శరీరానికి బలాన్ని చేకూర్చే న్యూట్రియంట్స్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే కెఫిన్ కూడా అత్యధికంగా ఉంటుంది. ఇవి కడుపులో ఉండే బిడ్డపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి. అందుకే గర్భిణులు కూల్‌డ్రింక్స్ తాగకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కూల్ డ్రింక్స్ తాగడం వల్ల గర్భం కోల్పోయే ప్రమాదం ఎక్కువ శాతం ఉంటుందన్నారు.
కూల్ డ్రింక్ తయారి సంస్థలు తమ ప్రొడక్ట్స్‌లో ఎన్నో రకాల కెమికల్స్‌ను వాడుతాయి. వాటిని కంటికి కనిపించని విధంగా చిన్నగా రాసి ఉంచుతారు. వీటిలో కెఫిన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇవి శరీరానికి ఇన్‌స్టంట్ ఎనర్జీ ఇస్తాయి కానీ, అనారోగ్యానికి గురి చేస్తాయి. అందుకే అతిగా కూల్ డ్రింక్స్ సేవించడం మానుకోవాలి. దీని వల్ల కడుపులోని పేగులు, గుండెల్లో మంట, దంతాలు పుచ్చిపోవడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే గర్భిణులు కడుపులో పిండం తయారైన క్షణం నుంచి బిడ్డ జన్మించేవరకు ఎలాంటి కూల్ డ్రింక్స్ తీసుకోవద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.