నలుగురికి సేవ చేయాలన్నా, నలుగురితో కలిసి పోవాలన్నా, నలుగురి మెప్పు పొందాలన్నా ఎంతో పెద్ద మనసు ఉండాలి. అలాంటి మనసు ఉన్న వారే సేవ గురించి నలుగురు బాగుపడడం గురించి ఆలోచిస్తారు. వారు కూడా జీవితంలో ఎన్నో మెట్లు పైకి ఎక్కి మరెన్నో శిఖరాలను అధిరోహిస్తారు. అలా 82 ఏళ్ల లక్ష్మీనరసింహ జీవితంలో ఎంతో ఎత్తు ఎదిగి ఎంతో మందికి జీవితాన్ని ప్రసాదించారు. ఆమె జీవితంలోని ప్రతి పేజీ లో త్యాగం కనిపిస్తుంది. ప్రతి మలుపులోనూ పరోపకారం ప్రతిఫలిస్తుంది. మలిసంధ్య లో కూడా సేవా పథంలో నడుస్తూ పదిమందికి దిశానిర్దేశం చేస్తున్న బిరుదురాజు లక్ష్మీ నర్సమ్మ పంచుకున్న అనుభవాలు ఆమె చూద్దాం.

ఎనిమిది పదుల వయస్సు దాటినా ఇప్పటికీ ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను అని చెప్తుంది నరసమ్మ. పెద్దబాలశిక్ష చదువు నాది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మా ఊరు.. 13 ఏళ్లకే పెళ్లి చేశారు. మా ఆయన కు హైదరాబాదులో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. దాంతో మేం సిటీ కి వచ్చేసాం. మా అమ్మమ్మ తాతయ్య అంబర్ పేట లో ఉండే వాళ్ళు.. మేము అక్కడే ఉండేవాళ్ళం. అమ్మమ్మ ఇరుగు పొరుగు పిల్లలకు పాఠాలు చెప్పేది. నేను అక్షరాలు నేర్పించే దాన్ని. అలా చదువు చెప్పడం అలవాటు అయింది.

మా ఊరు నుంచి ఎవరు ఏ అవసరానికి హైదరాబాద్ వచ్చినా మా ఇంట్లోనే ఉండే వాళ్ళు. ఎవరికైనా సుస్తీ చేస్తే ఉస్మానియాకు తెచ్చేవాళ్ళు. రోగి బంధువులు మా ఇంట్లోనే ఉండే వాళ్లు. వాళ్లకు వంట క్యారేజ్ కట్టుడు అన్నీ చేస్తుండేదాన్ని.  అందరికీ వంది పెట్టిన అస్సలు ఇబ్బంది అనిపించేది కాదు. ఆ రోజుల్లో మన వాళ్లు అనే భావన బలంగా ఉండేది. అంతే కాదు నాకు కొంచెం ఆయుర్వేదం పై అవగాహన ఉంది. మా ఊర్లో ఏదైనా సమస్య వస్తే మందులు ఇచ్చే దాన్ని. ఇప్పటికీ నా కొడుకు తోటి కొన్ని రకాల మందులు తయారు చేస్తుంటారు. మా ఆయన అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారికి బాడీ గార్డ్ గా కొన్నాళ్లు ఉన్నాడు. చాలా ఏళ్లు ఆయన పార్టీకి పని చేసినాము. తర్వాత లక్ష్మీపార్వతి తో కలిసి ప్రజల్లో తిరిగి ఉన్నంతలో నలుగురికి సాయం చేసే దాన్ని. మా ఆయన కూడా నాలాగే. ఏడాది కిందట నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నా వయసు 82 ఏళ్లు. చిన్న కొడుకు రాజు తో ఉంటున్నా.  నాకు నెలకు 17000 రూపాయల పెన్షన్ వస్తుంది. దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ స్థాపించాను. ఆ ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి సేవా కార్యక్రమాలు చేస్తున్నాను.


మరింత సమాచారం తెలుసుకోండి: