గర్భధారణ సమయంలో ఎక్కువగా వచ్చే మార్పులు ఇలా ఉంటాయి. చాలా వరకు గర్భిణులకు మొటిమలు, స్కిన్ ట్యాగ్‌లు, చర్మంపై సాగిన గుర్తులు, దురద, హైపర్ పిగ్మెంటేషన్, ప్రురిటిక్ ఉర్టికేరియల్ పాపుల్స్ అండ్ ప్లేక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (పీయూపీపీపీ) వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. గర్భిణులకు చర్మంపై మచ్చలు రావడం సహజం. ఇవి సాధారణంగా పొట్ట భాగంలో, తొడలపై, పిర్రలపై వస్తుంటాయి.
గర్భిణులకు శరీరంలో హార్మోన్లు అదనంగా ఉత్పత్తి అవుతాయి. వీటి వల్ల యాక్నే, మొటిమలు ఏర్పడతాయి. ఇలాంటి సమయంలో ఉదయం, సాయంత్రం వేళల్లో సబ్బును ఉపయోగించి చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి. అలాగే చర్మం సాగడం వల్ల దురదలు వస్తుంటాయి. యాంటీ ఇచ్ క్రీములు, లోషన్లు వాడితే సరిపోతుంది. లేదా దురద ఉన్న ప్రదేశంలో చర్మం తేమగా ఉండేందుకు కొబ్బరినూనెలతో మసాజ్ చేయాలి. అలాగే చర్మం కూడా నల్లబడుతుంది. నలుపు మచ్చలు కూడా వస్తాయి. దీనిని మెలాస్మా అంటారు. ఈ మచ్చలు నుదిటిపై, ముఖంపై కనిపిస్తాయి. అప్పుడు సన్‌స్క్రీన్ లోషన్లు వాడితే సరిపోతుంది. చర్మ సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు కచ్చితంగా వైద్యులను సంప్రదించాలి. వైద్యులు తెలిపిన సూచనలు, సలహాలు పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలి.