గర్భధారణ సమయంలో మహిళలు ఆహారాన్ని కొంచెం ఎక్కువగానే తీసుకుంటూ ఉంటారు. సాధారణంగా చాలా మంది గర్భిణీ స్త్రీలకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలియదు. ఏది పడితే అది తినడం వలన ఆరోగ్యానికి దారి తీస్తాయి. అందుకే గర్భిణులు ఫుడ్ విషయంలో వైద్యులను సంప్రదించాలని చెబుతుంటారు. ఇక ఇప్పుడున్న క్లిష్ట సమయంలో మహిళలు రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అయితే సాధారణంగా విటమిన్ సి తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ సి సిట్రస్‌ ఫ్రూట్స్‌లో ఎక్కువగా ఉంటుంది. సిట్రస్‌ ఫ్రూట్స్‌లో ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. వ్యాధుల బారిన పడకుండా ఇమ్యూనిటీ పెంచడానికి, వ్యాధులతో పోరాడటానికి విటమిన్‌ సి ఎంతగానో దోహదపడుతుంది. అయితే ఆరేంజ్, నిమ్మరసం, బత్తాయి రసం వంటి పండ్లలో  విటమిన్ సి ఎక్కువగా లభిస్తుంది.

ఇక నారింజ పండ్లలో విటమిన్‌ సీతో పాటు పొటాషియం, ఫాస్పరస్, కాపర్‌ వంటివి అధికంగా లభిస్తాయి. నారింజలో 90 శాతం నీరు ఉంటుంది. అందుకే నారింజను తినడం వలన బాడీ ఎప్పుడు హైడ్రేటెడ్‌ గా ఉండేందుకు సహాయపడుతుంది. సాధారణంగా గర్భిణులు కడుపులో వికారం, వాంతులతో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ఆ సమస్యలకు సిట్రస్‌ పండ్లతో ఈ సమస్యకు చెక్‌ పెట్టొచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. సిట్రస్‌ ఫ్రూట్స్‌ తీసుకోవడం వలన శిశువు మెదడు అభివద్ధి చెందటానికి సహాయపడతాయి.

అలాగే అవొకాడో పండుని బటర్‌ ఫ్రూట్‌ అని కూడా అంటుంటారు. ఆ పండులో బి1, బి2, బి6, సి, ఇ, వివిధ రకాల విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఈ ఫ్రూట్‌ మంచి రుచితో పాటు అనేక పోషకాలను కలిగి ఉంటుంది. అవొకాడో గర్భిణుల ఆరోగ్యానికి, పిండం అభివద్ధికి సహాయపడుతుంది. ఇక అవొకాడోలో ఫోలిక్‌ యాసిడ్‌ అధికంగా లభిస్తుంది. అంతేకాదు.. ఇది ఆహారం బాగా జీర్ణం కావడానికి దోహదపడుతుంది. ఇక కాళ్ల తిమ్మిరి నుంచి ఉపశమనం కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: