గర్భధారణ సమయంలో మహిళలు నాలుగో నెల నుంచి ఆరో నెల వరకు రోజుకు 7.6 గ్రాముల ప్రొటీన్ చాలా అవసరం. ఇక ఏడో నెల నుంచి తొమ్మిదో నెలవరకు మూడో త్రైమాసికంగా భావించాలి. ఇక మూడో త్రైమాసికం సమయంలో రోజుకు 17.6 గ్రాముల ప్రొటీన్ అవసరం ఉంటుంది. ఇక మొదటి నుంచి కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్, అయోడిన్, థయామిన్, రైబోఫ్లవిన్, నియాసిన్, విటమిన్ బి6, ఫొలేట్, విటమిన్ బి 12, విటమిన్ ఏ, సీ, డీ అందేలా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అయితే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నామని చెబితే వైద్యులు ఒకటీ రెండు నెలల ముందే ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లు ఇస్తుంటారు. గర్భధారణ సమయంలో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవడం మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాక.. ప్రతిరోజు తినే పోషకాహారంలో ఫోలిక్ యాసిడ్ తగినంత పరిమాణంలో ఉండేలా చూసుకోవాలి. ఇక ఫోలిక్ యాసిడ్ తగినంత అందితే కడుపులో ఉన్న బిడ్డకు అంగవైకల్యం లేదా ఇతర ఎదుగుదల లోపాలేవీ లేకుండా చూసుకోవాలి.
అంతేకాదు.. ప్రెగ్నెన్సీ వివిధ దశల్లో ఉన్నప్పుడు వైద్యులు ఐరన్ ట్యాబెట్లు, కాల్షియం టాబ్లెట్లు, ప్రొటీన్, ఇతర మినరల్స్ ఉండే ఎన్‌ష్యూర్, మదర్ హార్లిక్స్ వంటివి అందేలా మెడిసిన్ రాస్తుంటారు. ఇక ప్రెగ్నెసీ సమయాల్లో ఐరన్, కాల్షియం తల్లికి, బిడ్డకు అవసరమని తెలుసుకుంటూ ఉండాలి. గర్భిణులు ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా గర్భిణుల ఆరోగ్యం చక్కగా ఉండడంతోపాటు పుట్టబోయే బేబీకి కండరాలు, జుట్టు, చేతి గోళ్ళు, ఎముకలు, కణజాల అభివద్ధికి, మెదడు ఎదుగుదలకు దోహదపడుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.