సాధారణంగా గర్భధారణ సమయంలో మహిళలు అనేక జాగ్రత్తలు తీసుకోవకోవాల్సి ఉంటుంది. అయితే గర్భిణులు చేపలు తినడం వలన అనేక అద్బుతమైన ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ తరుణంలో ఈ అంశంపై అమెరికాలోని బోస్టస్‌లో ఉన్న కోపెన్‌ హాగెన్‌ లోని స్టేటన్స్ సీరమ్ ఇన్‌ స్టిట్యూట్ పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు.

అయితే నెలలు నిండకుండానే ప్రసవించిన రక్తనమూనాల్లో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు 1.6% తక్కువ ఉన్నట్లు వారు గుర్తించినట్లు తెలిపారు. ఇక ఈ సందర్భంగా వారు మహిళలు గర్భం దాల్చిన తొలి వారం నుంచే చేపలను సరిపడా మోతాదులో తీసుకోవాలని పరిశోధకులు సుచినట్లు తెలిపారు. అయితే చేపలు గర్భిణులకు, బాలింతలకు మేలు చేస్తాయని మన పెద్దలు చెబుతుంటారు. ఇక ఇప్పుడు పరిశోధకులు కూడా అదే మాట అంటున్నారు. అయితే గర్భిణులు చేపలను ఆహారంగా తీసుకోవాలని అన్నారు. ఇక లేకపోతే వారికి నెలలు నిండకముందే ప్రసవం జరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

అంతేకాక.. ఈ పరిశోధనలో భాగంగా నెలలు నిండకుండానే బిడ్డకు జన్మనిచ్చిన 376 మంది మహిళలు, సాధారణ ప్రసవం అయిన 348 మంది మహిళల రక్తనమూనాలను విశ్లేషణ చేస్తున్నారు. ఇక పరిశోధనలో భాగంగా నెలలు నిండకుండానే బిడ్డకు జన్మనిచ్చిన 376 మంది మహిళలు, సాధారణ ప్రసవం అయిన 348 మంది మహిళల రక్తనమూనాలను విశ్లేషించారు.

ఇక చేపలను గర్భిణులు క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకుంటే డయాబెటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు దరిచేరవు అని తెలిపారు. ఇక చేపల ద్వారా లభించే పోషకాలు శరీర ఆరోగ్య సమతుల్యతను కాపాడతాయని అన్నారు. అంతేకాక అన్ని రకాల వ్యాధులతో పోరాడటానికి ఇవి సహాయపడుతాయని అన్నారు. అంతేకాదు.. వీటితో పాటు చేపలు తినడం వల్ల జీవక్రియ, నిద్ర నాణ్యత, చర్మ ఆరోగ్యం, ఏకాగ్రత వంటివి పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: