అయితే ఆడవారికి అందం మేకప్..చిన్న ఫంక్షన్ అయినా సరే..అందులో తామే సెంటర్ ఆప్ అట్రాక్షన్ గా నిలవాలి అనుకుంటారు. ఆ క్రీమ్ లు ఈ క్రీమ్ లు రాసి మొత్తానికి అందంగా తయరవుతారు. అయితే గర్భంతో ఉన్న మహిళలు మేకప్ కు దూరంగా ఉంటేనే మంచిదట. అసలు ఆ తొమ్మిది నెలలు ఎలాంటి క్రీమ్స్ కానీ, లిప్స్టిక్స్ కానీ రాసుకోకపోవటం మంచిందని తాజా పరిశోధనలో తేలింది. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీకి చెందిన కొంతమంది పరిశోధకులు మేకప్ వేసుకునే గర్భిణీలను పరీక్షించారు.
గర్భిణీలు లిప్స్టిక్, మాయిశ్చరైజర్లు, ఇతర సౌందర్య సాధనాలను ఎక్కువగా వాడరాదని, అసలు వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని వారు చెబుతున్నారు. గర్భం దాల్చిన స్త్రీలు మేకప్ వేసుకోవడం వల్ల ఆ మేకప్ సామగ్రిలో ఉండే కెమికల్స్ ప్రభావం పుట్టబోయే బిడ్డమీద పడుతుందట. దీనవల్ల బిడ్డలలో చురుకుదనం లేకపోవడం, మానసిక ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవడం.. వంటి సమస్యలు వస్తాయని పరిశోధనలో తేలింది. అందువల్ల గర్భిణీలు మేకప్ సామగ్రికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.
స్త్రీ జాతికే వన్నే తెచ్చేది మాతృత్వం..భార్య గర్భం దాల్చిందని తెలిసిన భర్త ఆనందానికి అవధులు ఉండవు..ఇక ఆ స్త్రీని అపురూపంగా చూసుకుంటారు. అలాంటింది మేకప్ వేసుకుని పుట్టబోయే బిడ్డను ఎందుకు ప్రమాదంలో పడయోటం.. ఎలాంటి కెమికల్స్ ను ఆ తొమ్మిది నెలలు తీసుకోకపోవటం మంచిదని ఈ విషయం తెలిసిన వారంతా అనుకుంటున్నారు. అయితే కొందరికి మేకప్ నిత్యజీవితంలో భాగమైంది. అలాంటి వారు కెమికల్స్ తక్కువుగా ఉన్న క్రీమ్స్ వాడటం మంచింది.