ఈతరం మహిళల్లో ఎంతో ఆత్మస్థైర్యం, ధైర్యసాహసాలు కూడుకుని ఉన్నాయి. కాబట్టే వారు అన్ని రంగాలలో విజయం సాధిస్తున్నారు. ఈ రంగం ఆ రంగం అనే తేడా లేకుండా ప్రతి ఒక్క రంగంలో తమ విశేష సేవలందిస్తూ దేశానికి ఎంతో గర్వకారణంగా నిలుస్తున్నారు భారతీయ మహిళలు. ఇక తెలుగు రాష్ట్రాలలో మహిళలు కూడా ఇప్పుడిప్పుడే అన్ని రంగాలలో పురుషులకు సమానంగా సేవలందించడం మనం చూస్తున్నాం. ఆవిధంగా గా తెలంగాణలోని మంచిర్యాలకు చెందిన అజ్మీర్
బాబీ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ ఉంది.
ఏరోప్లేన్ పైలెట్ గా ఆమె ఎలా మారిందన్న ఆసక్తికర విషయాలను ఇటీవలే తెలిపింది. మా కుటుంబంలో బంధువులలో ఎవ్వరు ఏవియేషన్ రంగంలో లేరు.. అసలు మాకు దీని గురించి భరోసా ఇచ్చే వారు కూడా లేరు. దీంతో నాకు చాలా కష్టంగా అనిపించింది. నా కలను నెరవేర్చుకునేందుకు చాలా శ్రమించాను. నాపై నేను పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ధైర్యంగా ముందుకు వెళ్లాను అని ఆమె వెల్లడించారు. రిస్క్ తీసుకోవడం నాకు చాలా ఇష్టం.
ఆడపిల్ల అనగానే ప్రభుత్వ ఉద్యోగం, టీచర్లు, డాక్టర్లు అవ్వమని ఇళ్లల్లో ప్రోత్సహిస్తారు. అందుకే నేను మాత్రం అందరికంటే భిన్నంగా అవ్వాలని ఆలోచించేదాన్ని.
ఎంబీఏ పూర్తి చేశాక కేబిన్ క్రు సిబ్బంది కోసం ఒక
ఎయిర్ లైన్స్ ఇచ్చిన ప్రకటన చూసి దానికి దరఖాస్తు చేశా. ఫస్ట్ ఛాన్స్ లోని ఎయిర్ హోస్ట్ గా ఎంపికయ్యారు. అదే నా లక్ష్యాన్ని సాధించడంలో మొదటి మెట్టు. ఎయిర్ హోస్టెస్ అనగానే చాలా కుటుంబాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. ఈ రంగాన్నే ఎంచుకోవడానికి చాలామంది ఒప్పుకోరు. కానీ తల్లిదండ్రులు తమ పిల్లలపై నమ్మకంగా ఉండాలని కోరారు. ఎయిర్ హోస్ట్ గా పనిచేస్తున్న సమయంలోనే పైలట్ ట్రైనింగ్ కు సెలెక్ట్ అయ్యాను. తొలిసారి ఆకాశంలోకి ఎగిరి నప్పుడు కిందకు చూస్తే చాలా భయం వేస్తుందని ఆ భయం వడిలినప్పుడే ట్రైనింగ్ పూర్తి చేయగలమని చెబుతోంది.