సమాజంలో మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తూ వారికి ఎంతగానో పోటీ ఇస్తున్నారు. అంతరిక్షం లోకి వెళ్లే దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయంలో వారు తామేం తక్కువ కాదంటూ నిరూపించుకుంటున్నారు. సమాజంలో మహిళలు సత్తా చాటితేనే సమాజం మరింత ముందుకు వెళుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది. ముఖ్యంగా భారతీయ నటీమణులు తమ అ వీర ప్రతిభతో ఎంతో మంది మనుసులు దోచుకుంటున్నారు. గతంలోలా కాకుండా ఇప్పుడు వంటిల్లను వదిలేసి బయటకు వచ్చి ప్రపంచాన్ని చూడడం మొదలుపెట్టారు.
అలా భారతీయ సంతతికి చెందిన బండ్ల శిరీష అంతరిక్షయానం చేయడానికి సిద్ధమయ్యారు. కొన్ని రోజులుగా ఈమె అంతరిక్షయానం చేయబోతున్నారనే వార్తలు దేశవ్యాప్తంగా ట్రెండింగ్ గా నిలిచింది. ఆమె గురించి, నేపథ్యం గురించి అందరూ తెలుసుకోవడం మొదలుపెట్టారు. విశేషంగా
తెలంగాణ బిడ్డ కావడం తో ఆమె గురించి తెలుగువారు తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఈ అంతరిక్ష
యాత్ర విజయవంతం అయితే ఈ ఘనత సాధించిన మూడో భారతీయ సంతతి మహిళ గా శిరీష నిలుస్తుంది.
నేడు ఆమె అంతరిక్ష యానానికి సిద్దమవగా గతంలో కల్పనా చావ్లా,
సునీత విలియమ్స్ స్పేస్ లో ప్రయాణించారు. వర్జిన్ గెలాక్టిక్
స్పేస్ షిప్ లో ఆ సంస్థ అధిపతి
రిచర్డ్ బ్రన్సన్ తో మరియు ఐదుగురు సభ్యులతో కలిసి శిరీష ఈ అంతరిక్ష ప్రయాణం చేయనుంది. ఈ షిప్ లో భాగస్వామి కావడం తమకెంతో గర్వ కారణమని శిరీష ట్వీట్ చేశారు. షిప్ లో ఆమె రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ బాధ్యతలు చేపట్టింది. తనకు ఈ అవకాశం దక్కినట్లు తెలియగానే తాను ఎంతో గర్వించినట్లు దీన్ని సాధించి అందరి మన్ననలను పొందుతాను అని ఆమె చెప్పింది. ఇకపోతే ఆమె వర్జిన్ గెలాక్తిక్ లో ప్రభుత్వ వ్యవహరలా విభాగ మేనేజర్ గా చేశారు. ప్రస్తుతం కంపని
గవర్నమెంట్ ఎఫైర్స్ అండ్ రీసెర్చ్ ఆపరేషన్స్ విభాగం వైస్ చైర్మన్ గా ఉన్నారు.