తెలంగాణ గ్రామీణ వాతావరణం, హైదరాబాద్ లోని రాజకీయ సాహిత్య సాంస్కృతిక చారిత్రక విషయాల తో పాటు అక్కడి సమస్యలను ఎంతో విపులంగా ప్రచురించిన పుస్తకం మే కౌన్ హో.  ప్రముఖ భారతీయ ఉర్దూ రచయిత్రి జిలానీ బాను తన బాల్యం యవ్వనం లోని అనేక విషయాలకు అక్షర రూపం కల్పిస్తూ యువ పాఠకులకు స్ఫూర్తి నింపేందుకు తన ఆత్మ కథను ఉర్దూ లో రాయగా  నేషనల్ బుక్ ట్రస్ట్ తరుణ భారతి తెలుగు లో ప్రచురించింది. హైదరాబాద్ సంస్కృతిని తన ఆత్మకథగా మలచిన జిలానీ 'తెరిచిన పుస్తకం'గా తెలుగు లో అనువదించగా ఇది ఎంతో మంది పాఠకుల అభిమానాన్ని అందుకుంది.

తన రచనల్లో దకనీ సంస్కృతి నీ సజీవంగా చిత్రించి ఎంతో ఆసక్తిగా మలుస్తుంది అమే.  భారత-పాకిస్తాన్ సాహితీ ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన జిలానీ భాను పుట్టింది ఉత్తరప్రదేశ్లోని బడాయు అనే ప్రాంతం లో. ఉర్దూ సాహిత్య ఆకాశంలో అగ్ర రచయిత్రిగా వెలుగుతున్న జిలానీ బాను అనగానే నిన్నటి నేటి తరాలకు గుర్తు వచ్చేవి అనే ఐవానే గజాల్. తెలుగు తో పాటు దాదాపు అన్ని భారతీయ భాషలలోకి అనువాదం అయిన ఈ నవల గతించిన కాలం నాటి మహోజ్వల సంస్కృతి పతనానికి అద్దం పడుతుంది.

ఇక జిలానీ మై కౌన్ హు లో స్త్రీ, పురుషుడు, పశుత్వం మధ్యగల త్రిముఖ సంఘర్షణలను  చూడవచ్చు.  జిలానీ బాల్యం, యవ్వనం జీవితాల నేపథ్యంగా నిజాం పాలన కాలంలోనే హైదరాబాద్ కు సంబంధించిన అనేక సాంస్కృతిక అంశాలు, సాహిత్యం, సాహితీవేత్తలు , సాయుధ రైతాంగ పోరాట కాలంలో విషయాలు సంస్కరణలు మధ్యతరగతి జీవితాలు ముస్లిం కుటుంబాలు హిందూ ముస్లింల పండుగలు కులమతాలకు అతీతంగా ఆనాడు జరుపుకున్న విధి విధానాలు మొదలైనవి చూడవచ్చు. సనాతన సంప్రదాయ ముస్లిం కుటుంబంలో పుట్టి పెరిగిన జిలాని ఆంక్షల, పర్ధా పద్ధతుల్లోనే పెరిగారు. తన బాల్య పరిస్థితుల గురించి ఆమె స్పష్టం గా ఈ నవల ద్వారా వెల్లడించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: