ఇటీవల కాలంలో చాలా మంది యువతీ యువకులు చదువుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుండడం కొత్త పరిణామానికి శుభసూచకం అని చెప్పవచ్చు. గతంలో చదువుకోమని చెప్పడానికి, చదవడానికి ఎన్నో కష్టాలు పడేవారు ప్రతి ఒక్కరూ. కొంతమందికి చదువు మీద ఆసక్తి లేకపోవడం, కొంతమందికి ఆసక్తి ఉన్న దానికి తగిన డబ్బు లేకపోవడం వంటివి ఎన్నో చదువు ప్రజలకు దగ్గర కానివ్వకుండా చేసేవి. కానీ ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరిలో అవగాహన రావడంతో చదువులో తమ ప్రతిభ ను చాటేందుకు విద్యార్థులు ముందుకు వస్తున్నారు.
ముఖ్యంగా మహిళా విద్యార్థులు తమ కుటుంబ పరిస్థితులను చూసి వెనకడుగు వేయకుండా చదువుకుంటే కుటుంబాన్ని కుటుంబ ఆర్థిక పరిస్థితిని మార్చవచ్చు అని భావించి విద్యలో ఎంతో గొప్పగా రాణిస్తున్నారు. ఎంతో మంది మహిళలు ఇప్పటివరకు చాలీచాలని డబ్బుతో చదువుకొని గొప్ప గొప్ప స్థాయికి ఎదిగిన వారు ఉన్నారు. అలా ఓ ఆటో
డ్రైవర్ కూతురు తన పరిస్థితులు ఏమాత్రం తన చదువు కు అడ్డు కాదని ఇంటర్మీడియట్ లో 98 శాతం మార్కులు సాధించి ఎందరో తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచింది.
ఉత్తరాఖండ్ లోని
డెహ్రాడూన్ కు చెందిన ఐరమ్ అనే విద్యార్థిని అక్కడి పూల్ చంద్ నారీ శిల్ప బాలికల ఇంటర్మీడియట్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది.
తండ్రి ఆటో డ్రైవర్. చాలీచాలని సంపాదనతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా పిల్లల చదువు దగ్గర మాత్రం ఎప్పుడూ రాజీ పడలేదు.
తండ్రి కష్టాన్ని వృధా చేయకుండా ఐరమ్ చదువును తన ఊపిరిగా చేసుకుని ఇష్టపడి చదివి ఇంటర్మీడియట్ లో 98 శాతం మార్కులు సాధించి ఎందరికో ఆదర్శంగా నిలిచింది. వైద్యురాలు కావాలనే తన లక్ష్యమని చెప్పింది. తాను ఇప్పుడు నీట్ కు సిద్ధమవుతున్నట్లు
డాక్టర్ అవ్వడం వల్ల మా ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగు పరుచుకోవడం తో పాటు ప్రజలకు కూడా సేవచేసే అవకాశం లభిస్తుంది అని చెప్పింది. నాకు సహాయం చేసిన ఉపాధ్యాయులకు జీవితాంతం రుణపడి ఉంటాను అని చెప్పింది.