అంతేకాక.. ఈ సీజన్‌లో గర్భిణులు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, కాల్షియం, ప్రోటీన్, కేలరీలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని అన్నారు. కాగా.. ఈ సీజన్‌లో తినడం, తాగడంలో అజాగ్రత్త మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని సూచించారు. అంతేకాదు.. ఈ సీజన్‌లో అంటు వ్యాధి వచ్చే ప్రమాదం ఉందన్నారు. అంతేకాక.. ఈ వర్షాకాలంలో సురక్షితంగా ఉండటానికి గర్భిణులు కొన్ని చిట్కాలు పాటించాలని సూచించారు.
ఇక ఇప్పుడు ప్రభుత్వం గర్భిణుల కోసం ప్రత్యేకంగా కరోనా వ్యాక్సిన్ డ్రైవ్‌లు నిర్వహించి వారికి టీకాలు వేయిస్తోందని తేలిపారు. అయితే టీకాలు తీసుకోవడం వలన గర్భం ధరించిన మహిళలు ముందుగా గైనకాలజిస్టును సంప్రదించి వ్యాక్సినేషన్ గురించి చర్చాలని సూచించారు. అంతేకాదు.. వారు అనుమతిస్తే తప్పకుండా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. కాగా.. ఈ ప్రక్రియ కోసం ధైర్యంగా ముందుకు సాగించాలని తెలిపారు. అయితే కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న ఈ సమయంలో మీతో పాటు మీ బిడ్డ ఇద్దరినీ సంరక్షించడంలో కరోనా వ్యాక్సినేషన్ ఖచ్చితంగా సహాయ పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అయితే ప్రస్తుత వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకోకుండా మీరు ఎల్లప్పుడూ ఎక్కువగా మంచినీరు తాగాలని తెలిపారు. ఇక దాహం కావడం లేదనే అశ్రద్ధ వహించకుండా తగినంత ద్రవాలు మీరు తీసుకోవడానికి అదనపు శ్రద్ధ వహించాలని తెలియజేశారు. అంతేకాదు.. గర్భిణులు రోజుకు ఎట్టి పరిస్థితుల్లో మినిమం 2.5 లీటర్ల నీరు తాగాలని వైద్యులు చెబుతున్నారు. కాగా.. ఈ నీరు వేడి టీ లేదా హాట్ చాక్లెట్ లేదా హాట్ సూప్ ఇలా ఏదైనా రూపంలో శరీరానికి అందించాలని తెలిపారు.