ప్రసవానంతరం బాలింతలు హాస్పిటల్లో ఆ తరువాత ఇంట్లో కూడా బిడ్డకి పాలివ్వడానికి అనువుగా ఉండే బట్టలు వేసుకోవాలని చెబుతున్నారు. అంతేకాక.. ఒకసారి పాలు రావడం మొదలైన తరువాత బ్రెస్ట్ ప్యాడ్స్ అవసరం కావచ్చునని అన్నారు. ఇక బేబీ ముందే పుట్టేసినా లేదా పాలు పీల్చలేకపోయినా బ్రెస్ట్ పంప్ యొక్క అవసరం కూడా ఎదురు కావచ్చునని అన్నారు.
అయితే మీరు డాక్టర్ తో మాట్లాడి బిడ్డ పుట్టిన ఒక గంట లోపే పాలివ్వడానికి ఒక ప్లాన్ వేసుకోవాలని చెబుతున్నారు. అంతేకాక.. మీకు కానీ, బేబీకి కానీ ఏదైనా మెడికల్ ఇష్యూ ఉంటే ఇది సాధ్యం కాదని అన్నారు. ఇక ప్రసవం అయిన వెంటనే వచ్చే కొలోస్ట్రం, వీటినే ముర్రు పాలు అంటారని అద్నరికి తెలిసిన విషయమే. అందులో పోషకాల తోనూ, యాంటీ బాడీస్ తోనూ నిండి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాగా.. బిడ్డ పుట్టిన గంటలోపే ఇది బిడ్డకి అందడం చాలా మంచిదిని అన్నారు. అయితే నార్మల్ డెలివరీ తరువాత వెంటనే మీ బేబీని హత్తుకోవడానికి ప్రయత్నించండి, సిజేరియన్ తరువాత ఎంత త్వరగా ఇది జరగగలిగితే అంత మంచిదని చెబుతున్నారు.
ఇక బాలింతలు ఇంట్లో పనులు చూసుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇప్పటికే ఒక బేబీ ఉంటే వాళ్ళని చూసుకోవడానికీ మీకు ఇతర కుటుంబ సభ్యుల సహాయం అవసరం అని అన్నారు. ఇక అప్పుడే మీరు పూర్తిగా మీ ఫోకస్ ని బేబీ మీద పెట్టి ఉండగలుగుతారని తెలిపారు. అంతేకాక.. తగినంత విశ్రాంతి తీసుకోవడానికి కూడా కుదురుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.