పాటతో తెలంగాణ సంస్కృతి చెబుతుంది
ఇంటి గడప తొక్కే ఆడబిడ్డ ఆనందం
ఆ ఒక్క పాటలో ఆ ఒక్క పాటతో
సిరి సంపదలు ఇచ్చే బిడ్డలు
సిరి సంపదలం తామే అనే బిడ్డలు
పాదాల సవ్వళ్లను విని పొంగిపోయే తండ్రులు
వీళ్లంతా ఆడ బిడ్డల తండ్రులు..
తెలంగాణ వాకిట ఈ పాట
మార్మోగిపోతోంది మోహన భరద్వాజ్ ఆలపించిన పాట
అనగనగా పెళ్లి..అత్తారింటికి తీసుకువెళ్లే పెళ్లి..కొత్త జీవితం ఇచ్చే పెళ్లికి కానుకలు.. నవ్వులు ఏడ్పులు..ఇవి తప్ప ఏముంటాయి. కన్నీరు కానుక అవుతుందా.. నాన్న కన్నీరు కదా అది కూడా కానుకే తప్పేం కాదు.. నవ్వు కానుక అయితే కన్నీరెందుకు కా కూడదు..కాబోయే భర్త ఎదురుగా.. నీ జీవితాన్ని నేను పలకిరిస్తాను అని చెప్పే సందర్భం. నీ జీవితాన్ని నేను నందనవనం చే స్తాను అని చెప్పే సందర్భం. పెళ్లిలోనే పెళ్లితోనే.. ఈ పాట ఒక్క చోట రెండు చోట్లా కాదు అన్నింటా మార్మోగిపోతుంది..
సాధారణంగా అమ్మాయిల ఊహల ప్రకారం రెక్కలు గుర్రాలపై కాబోయే వాడు రావాలి. కానీ ఇక్కడ వరుడ్ని బుల్లెట్టు బండి పై ర మ్మంటుంది..ఇంటికి నేను ఒక్కమ్మాయినే నన్ను తన కళ్లలో పెట్టుకున్న నాన్న ఉన్నాడు ..అన్నలు ఉన్నారు..మరి! వాళ్లనువారి ప్రేమను దాటి నీ ప్రేమ ఉంటుందా అని చెబుతుందా పిల్ల. తన పాటలో.. అమ్మ చెంత నేను పెరిగాను..అమ్మకూ నాన్నకూ గౌరవం తెచ్చేలా నీ ఇంటికి వస్తున్నాను. ఆ సంబరం నాది. ఆ పండుగ నాది అని భావించి నీతో జత కడుతున్నాను.. నన్ను మారం చేసినా బాగా చూస్కుంటావా అని అడుగుతుందా పిల్ల. ఇన్ని పండుగలలో ఇన్ని ఆనందాల్లో తండ్రి తరువాత తండ్రి వి నీవే.. కావాలి. అని అ డగడం తెలంగాణ సంస్కృతిలో భాగం..భారతీయతలో భాగం. చుక్క పొద్దుకే నిద్రలేచి చుక్కల ముగ్గులు వే సి,నీ కన్నోళ్లనే నా కన్నోళ్లను అనుకుని నీ కష్టాల్లో భోగాల్లో నేనుంటాను అని చెబుతుందా పిల్ల. వావ్ .. ఒక మామూలు ఆడ పిల్ల ఇంతకుమించి ఏం చెప్పగలదు.. అదే ఈ పాట.. ఆలాపన ఎంత బాగుందో చిత్రీకరణ కూడా అంతే వన్నెతెచ్చింది. లక్ష్మణ్ రాసిన ఈ పాటకు, ఎస్కే బాజీ సంగీతం అందించారు. ఇప్పుడిదే పాట తెలంగాణ పెళ్లి వేడు కల్లో సందడి చేస్తుంది. నవ వధూవరులకు తోడుగా ఉంటుంది. పాటే తోడు.. పాటే తెలంగాణ వాకిట అమ్మకు తోడు.. నాన్నకు తోడు.. సంస్కృతికి తోడు.. తోడునీడల ప్రయాణం పాట మాత్రమే నేర్పింది ఆ నేలకు.