ప్రపంచంలో మహిళలు వెనకబడి ఉన్నారని ఎవరు చెప్పారు. ప్రతి రంగంలో మహిళలు తమదైన ప్రతిభతో ముందుకు దూసుకుపోతూ ఉన్నారు. ప్రపంచ అభివృద్ధి కి కారణమైన ఐటి రంగంలో కూడా మహిళలు అత్యున్నత స్థానానికి చేరుకున్నారు. ఈ రంగంలో అత్యంత శక్తివంతులుగా పురుషులకు మాత్రమే చోటు ఉంటుందని భావిస్తున్న ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే తమ తమ అభిప్రాయాలను వారు మార్చుకోవాల్సి ఉంది అనిపిస్తుంది. ఐటీ పరిశ్రమలో పురుషులు ఆధిపత్యం నడుస్తున్నా కూడా ప్రతిభావంతులైన మహిళా మూర్తులు తమ వంతు భాగస్వామ్యాన్ని అందిస్తున్నారు.
సదరు కంపెనీ భవిష్యత్తు కి పురోగతికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఐటీ పరిశ్రమలో అత్యంత
శక్తి వంతులైన వారి సరసన ప్రముఖ మహిళలు ఉండడం ప్రపంచానికి గర్వకారణం అని చెప్పవచ్చు. 2008 సంవత్సరానికి వాల్ స్ట్రీట్ జర్నల్ అనే సంస్థ 50 మంది ప్రముఖు మహిళల జాబితాను విడుదల చేసింది. ఇందులో ఏడుగురు ఐటీ పరిశ్రమకు చెందిన వారే కావడం విశేషం. దీన్నిబట్టి ప్రపంచ ఐటీ రంగంలో మహిళలు ఎంతటి గొప్ప పాత్ర నిర్వహిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. మహిళ తలచుకుంటే ఏదైనా చేయగలరు అని ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
ఈ జాబితాలో జెరాక్స్ కార్పొరేషన్ సీఈవో ఎమ్ ముల్కాయ్ అగ్రస్థానంలో ఉన్నారు. యాహూ సంస్థ ప్రెసిడెంట్ సుసాన్ డెకర్ 13 వ స్థానం లో, జెరాక్స్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ 16 వ స్థానం లో విండోస్ యూజర్ ఇంటర్ఫేస్ వ్యవహారాలు చూస్తున్న జూలీ 7 వ స్థానం లో, ఒరాకిల్ కార్పొరేషన్ సహా అధ్యక్షురాలు సాఫ్రా ఎ కాజ్ 19 వ స్థానం లో ఫేస్ బుక్ సీఈఓ షేరిల్ సాండ్ బర్గ్, సిస్కో సిస్టమ్స్ సిటి ఓ
పద్మశ్రీ వారియర్ తదితర మహిళలు కూడా ఈ జాబితాలో ఉన్నారు.
ఈ మహిళలు తమ కంపెనీ పురోగతికి ఎంతో పాటు పడి ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు