
స్త్రీ లేనిదే ఈ సృష్టే లేదు. మనిషి మనుగడకు అర్దం లేదు. ఒక అక్కగా, చెల్లిగా, బిడ్డగా, భార్యగా, తల్లిగా ఇలా తన ప్రతి కర్తవ్యాన్ని బాద్యతతో పాటు ప్రేమతో చేయడానికి ప్రత్నిస్తుంది స్త్రీ. ప్రేమే ఆమె బలం మరియు బలహీనత. మారుతున్న సమాజంలో పరిపక్వత పెరిగింది, బంధాలు, బాంధవ్యాలలోనూ మార్పులు వచ్చాయి. కానీ తల్లి ప్రేమలో మాత్రం ఎటువంటి మార్పు రాలేదు రాదు కూడా. తల్లి ఎప్పటికీ గొప్ప యోదురాలే. తన పిల్లల కోసం నిరంతరం ఆలోచిస్తూ, శక్తికి మించి శ్రమిస్తూ వారి సుఖం కోసం తాను కష్టపడుతుంది. తన బిడ్డల ఆనందమే తన సంతోషంగా భావించి వారే తన ప్రపంచంగా జీవిస్తుంది. ప్రస్తుత జనరేషన్ లో ఆర్థికంగా స్థిరపడడానికి మహిళలు కూడా ఉద్యోగాలంటూ పరుగులు తీయక తప్పడం లేదు.
అయినా తల్లి ఎప్పుడూ తన బిడ్డల బాధ్యతను మరువదు మరువలేదు. పుట్టినప్పటి నుండి పెరిగి పెద్దయ్యే వరకు పెంచి పెద్ద చేస్తుంది. తండ్రి ఉన్నా లేకపోయినా బంధువుల ఆదరణ లేకుండా ఒంటిరిగానే తన బిడ్డలను కాపాడుకుంటుంది. ఎన్నో గెలుపు పాటలు తమ బిడ్డలకు నేర్పుతుంది. అందుకే తల్లి తన బిడ్డ కోసం చేసే యుద్ధంలో ఒక యోధురాలు లాంటిది. కానీ నేడు అలాంటి తల్లులను గాలికొదిలేస్తున్నారు. అటువంటి ప్రతి బిడ్డ తల్లుల విలువను తెలుసుకుని చేరదీస్తారని ఒక ఆశతో మా చిన్న ప్రయత్నం.