గర్భవతిగా ఉన్నప్పుడు మహిళలు ఎన్నో సమస్యలు తలెత్తుతుంటాయి. మొదట్లో గర్భం కన్‌ఫార్మ్ అయినా.. ప్రెగ్నెన్సీ మిస్ క్యారేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలా మిస్ క్యారేజ్ అయిన జంటలు ఎంతగానో బాధ పడుతుంటారు. ప్రెగ్నెన్సీ కన్‌ఫార్మ్ అయిన తర్వాత ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే గర్భిణులకు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. కొందరికి తలనొప్పి రావడం, వాంతులు అవుతున్నట్లు అనిపించడం, విరక్తి, ఆకలి మందగించడం వంటి సమస్యలు వస్తుంటాయి. వీటి కోసం ఇంట్లో పెద్దవాళ్లు చెప్పే చిట్కాలు పాటించడం లేదా.. వైద్యుల సలహాలు తీసుకోవడం జరుగుతుంది.
ప్రెగ్నెన్సీ కన్‌ఫర్మ్ అయిన తర్వాత గర్భిణులకు మానసిక స్థితి సరిగ్గా ఉండదు. అధిక ఒత్తిడి, అనేక రకాల ఆరోగ్య సమస్యలతో సతమతమవుతుంటారు. ఇలాంటి సమస్యలు తరచూ సంభవిస్తుంటాయి. అందుకే గర్భిణులు తప్పనిసరిగా వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. అయితే గర్భిణీగా ఉన్నప్పుడు తలెత్తే సమస్యలపై ఎలాంటి మాత్రలు తీసుకోవాలా అనే విషయంపై స్పష్టతను ఇచ్చారు. గర్భం దాల్చిన తర్వాత మహిళల శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. గర్భిణుల కడుపుతోపాటు ఛాతి భాగంలోను అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. శరీరంలో విడుదలయ్యే హార్మోన్ల కారణంగా ఎన్నో మార్పులు సంభవిస్తాయి.
గర్భిణీగా ఉన్నప్పుడు వీరి జీవన విధానాలు మారుతాయి. శరీరంలో విడుదలయ్యే హార్మోన్ల వల్ల హెచ్చు తగ్గులు ఏర్పడుతాయి. లెప్టిన్ హార్మోన్, గర్భధారణకు అవసరమయ్యే ప్రధాన కారకం హ్యూమన్ క్రోనిక్ గొండొట్రోపిక్ హార్మోన్ వల్ల గర్భిణులకు వికారం, వాంతి, కాళ్లు తిమ్మిరి ఎక్కడం వంట సమస్యలు వస్తుంటాయని వైద్య నిపుణులు తెలియజేశారు. అయితే ఈ సమస్యలు గర్భధారణ సమయంలో కామన్‌గా వస్తుంటాయని పలువురు చెబుతుంటారు. ప్రెగ్నెన్సీ సమయంలో స్త్రీలు అనేక రకాల మందులు వాడుతుంటారు. అయితే ఆ ట్యాబ్లెట్లు, మందులు వాడటం వల్ల గర్భిణుల ఆకలిని తగ్గిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వీటి వల్ల శరీరానికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయని హెచ్చరిస్తున్నారు. అందుకే గర్భిణీగా ఉన్నప్పుడు పౌష్టికాహారం, ఫ్రూట్స్ తీసుకోవాలన్నారు. వీలైనంతవరకు మందుల వాడకాన్ని తగ్గించాలన్నారు.