మన కుటుంబ సభ్యులంతా ఎంతో సంతోషంగా ఒకచోట కూర్చొని భోజనం చేస్తుంటాం. ఆ భోజనం రుచిగా ఉన్నప్పుడే అందరూ ఆనందంగా భోజనం చేస్తారు. అలా వంట రుచి కరంగా రావాలి. అంటే అన్ని పదార్దాలు సమ పాల్లలో పడాలి. అప్పుడే ఆ వంట రుచికరంగా ఉండి ఇంటిల్లిపాదీ ఆనందంగా తింటారు. అయితే వంట అన్న తరువాత కొన్ని తక్కువ ఎక్కువలు అవుతుంటాయి. అపుడా వంట రుచే మారిపోతుంది. అలాంటప్పుడు కొన్ని చిట్కాలు తెలిసినట్లైతే కాస్త వాటిని సరి చేసుకోవచ్చు. అయితే ఆ చిట్కాలు ఏంటో ఇపుడు తెలుసుకుందాం.
* అన్నం వండేటప్పుడు కాస్త చిమిడింది అనిపిస్తే, అపుడు వెంటనే ఒక గ్లాసు మంచి నీళ్లు పోసి కాస్త కలిపి అప్పుడు అన్నం వంచాలి. ఇలా చేయడం వలన చిమిడిన అన్నం కాస్త పొడిపొడిగా వస్తుంది.
* అన్నం బాగా పొడి పొడిగా రావాలి అంటే వండేటప్పుడు అందులో ఒక పావు టీ స్పూన్ కంటే కూడా తక్కువ నూనె వేయాలి. తద్వారా అన్నం పొడి పొడిగా ఉంటుంది.
*చేసిన కూరలో ఉప్పు ఎక్కువైంది అనిపిస్తే అందులో కాస్త బియ్యం పిండి వేసి బాగా కలిపితే ఉప్పు తగ్గుతుంది.
* ఇది వంట చిట్కా కాదు కానీ మహిళలకు బాగా ఉపయోగపడుతుంది. కొందరి ఇళ్లల్లో వెండి వస్తువులు చాల ఉంటాయి. కానీ అన్నిటినీ నిరంతరం వాడకుండా అలానే పెట్టేస్తారు. అప్పుడు వాటి పై మరకలు పాడడం లేదా నల్లని మచ్చలు లాగా అయిపోవడం జరుగుతాయి. అలాంటప్పుడు వెండి వస్తువులు మెరుస్తూ ఉండాలి అంటే టూత్ పేస్ట్ తో వాటిని బాగా పీచుతో రుద్దితే నిగనిగ లాడుతాయి.
ఇది మాత్రం కాకుండా ఇంటికి ఉపయోగపడే అన్ని విషయాలను మీరు తెలుసుకుని పాటించగలిగితే ఉత్తమమైన గృహిణిగా ఇంటిలోనూ మరియు మీ బంధువులు చుట్టు పక్కల వారి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటారు.