ఇక పండ్లతో పాటు నట్స్‌ను కూడా తీసుకోవడం ఎంతో అవసరం అని.. అవి చాలా లైట్‌గా ఉంటాయని తెలిపారు. అయితే వాటి వల్ల కేలరీలు ఎక్కువ పొందవచ్చునని అన్నారు. అయితే సలాడ్స్ లో భాగంగా కూడా డ్రై ఫ్రూట్స్‌ను ఉపయోగించాలని చెబుతున్నారు. ఇక రోజు వారు తీసుకునే ఆహారంలో భాగంగా ప్రోటీన్ ఎంతో అవసరం అని చెప్పుకొచ్చారు. అయితే శాకాహారులు మాత్రం ప్రోటీన్ విషయంలో కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఇక బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో ప్రోటీన్ కూడా చాలా కీలక పాత్ర పోషిస్తాయని చెప్పుకొచ్చారు. వైద్యులు ఐరన్ కోసం సప్లిమెంట్స్‌ను ఉపయోగించాలని చెబుతున్నారు. మహిళలు సహజంగానే ఆహార పదార్థాల నుండి ఐరన్‌ను పొందడానికి ప్రయత్నించాలని అన్నారు.
అయితే ఎన్ని ఆహార పదార్థాలను తీసుకున్నా.. శరీరానికి తగినంత నీరు ఎంతో అవసరం అని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. మంచి నీరు మాత్రమే కాదు కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు, మజ్జిగ వంటి వాటిని కూడా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదన్నారు. వీటిని తీసుకోవడం వలన శరీరానికి శక్తి అందుతుందన్నారు. అయితే ముఖ్యంగా ప్యాకేజ్డ్ ఫుడ్స్ మాత్రం తీసుకోవద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్యాకేజ్డ్ ఫుడ్స్‌లో ఎక్కువ శాతం పంచదారను వాడుతుంటారు. అంతేకాక.. ప్రిజర్వేటివ్స్ వల్ల మరి కొన్ని సమస్యలు ఎదురవుతాయని పేర్కొన్నారు. పోషక ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిదని చెప్పుకొచ్చారు.