పిల్లలకు మంచి పొషకాలు ఉన్న ఆహారం పెట్టడం చాలా అవసరం.. ఎదిగే వయస్సులో వారికి మంచి పొషక విలువలు వున్న ఆహారాన్ని అందివ్వాలి. అప్పుడే బ్రెయిన్ డేవలప్ అవుతుంది. అయితే కొన్ని ఇవ్వచ్చు.. మరి కొన్ని ఇవ్వ కూడదు.. అందులో చాలా మందికి కొబ్బరి నీళ్ళు పిల్లలకు ఇవ్వొచ్చు నా లేదా అనే సందేహం కలుగుతుంది. కానీ వీటిని పిల్లలకు ఇవ్వడం వల్ల చాలా ఆరోగ్య ప్రయొజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..


కొబ్బరి నీళ్లలో మోనోలౌరిన్ అనే సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది. ఇది పిల్లలను అనేక వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుందని అంటున్నారు. ముఖ్యంగా చలికాలంలో పిల్లలకు జలుబు, దగ్గు, ప్లూ వంటి వాటి నుంచి ఇది రక్షిస్తుంది.. సోడియం, కొలెస్ట్రాల్, ప్రొటీన్, కాల్షియం, విటమిన్ సి వంటివి ఉంటాయి అందుకే చర్మం పగలకుండా ఇవి సహాయపడతాయి. బిడ్డ పుట్టిన ఆరు నెలల వరకు ఈ కొబ్బరి నీళ్ళు అవసరం లేదు. అందుకు కావలసిన పొషకాలు తల్లి పాల నుంచి లభిస్తాయి..


తర్వాత అన్నం లేదా ఏదైనా ఆహారపదార్థాలను తీసుకుంటారు అప్పుడు అరుగుదల కోసం కొబ్బరి నీళ్లు ఇవ్వడం మంచిది.మలబద్ధకం, అపానవాయువు మరియు అల్సర్ వంటి వివిధ కడుపు సమస్యలను తగ్గించడంతోపాటు ఉదర సమస్యలను పూర్తిగా తగ్గిస్తుంది. అంతేకాదు, పేగుల్లో వుండే పురుగులను తొలగించి వేస్తుంది. జీర్ణ సమస్యలను కూడా కొబ్బరి నీళ్లు దూరం చేస్తాయి.మలబద్ధకం, అపానవాయువు అల్సర్ వంటి దీర్ఘ కాలిక సమస్యలను దూరం చేసెందుకు ఇవి దోహదపడుతుంది. మూత్రమ్ వచ్చే నాలం లో ఏదైనా మంట లేదా చురుగ్గా వున్నా కొబ్బరి నీళ్లు తగ్గిస్తాయి.. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే బాడీ లోని వేడిని పూర్తిగా తగ్గిస్తాయని నిపుణులు అంటున్నారు.ఒకేసారి ఎక్కువగా నీళ్ళను ఇవ్వ కూడదు.. గుటిక ఇస్తూ వుండాలి.. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. చలికాలంలో చాలా వరకూ ఈ నీళ్ళు తాగించక పోవడం మంచిది..

మరింత సమాచారం తెలుసుకోండి: