సాదారణంగా బాడీ కి మసాజ్ క్రీములు ఉన్నట్లే ముఖానికి కూడా ఉన్నాయని సౌందర్య నిపుణులు అంటున్నారు..ఇంట్లోనే సహజసిద్ధమైన ఫేస్ మసాజ్ క్రీమ్స్ లను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఇటువంటి క్రీములు వల్ల ముఖానికి రక్త ప్రసరణ జరుగుతుంది.దాని వల్ల ముడతలను, మొటిమలు, మచ్చలు, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వంటి సమస్యలను శాశ్వతంగా తగ్గించడానికి ఈ ఫేషియల్ మసాజ్ లు తప్పనిసరి. ఇవి చర్మంలో వృద్ధాప్య ఛాయలను తగ్గించి, యవ్వనంగా కనిపించేలా చెస్తాయో..అందుకే
గ్లిజరిన్, రోజ్ వాటర్, కొబ్బరి నూనె, బాదం ఆయిల్ క్రీమ్: ఈ ఫేషియల్ మసాజ్ కోసం ఒక గిన్నెలో కొబ్బరి నూనె , బాదం నూనెను కాస్త వేడి చేయాలి.అది వేడి అయ్యాక రోజ్ వాటర్ ను గ్లిజరిన్ ను వేసి బాగా కలపాలి.
ఇలా తయారైన క్రీమ్ ను గాలి లేని డబ్బాలో నిల్వ చేసుకోవాలి.క్రీమ్ ను ముఖానికి అప్లై చేసి చేతి వేళ్ళతో సున్నితంగా మసాజ్ చేయాలి. ఈ ఫేషియల్ మసాజ్ చర్మానికి తగినంత తేమను అందించి చర్మాన్ని అందంగా మృదువుగా తయారు చెస్తుంది.
మరొకటి అవకాడో, పెరుగు తో తయారు చేసిన క్రీము కూడా మంచిది..ఒక కప్పు పెరుగు, అవకాడో పేస్ట్ ను తీసుకొని బాగా కలపాలి.ముఖానికి అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. ఇలా వారంలో రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.. ఇలాంటి క్రీములు వారానికి ఒకసారి ఉపయొగించాలి. అప్పుడే మంచి ఫలితం ఉంటుంది..