చాలా మందికి లేవగానే  టీ తాగటం అలవాటు ఉంటుంది. అది గొంతులో పడకుండా వాళ్ళు ఎ పని చేయరు. అందుకే టీ ని డైలీ అలవాటుగా మారిపోయింది. అయితే మనం ఎం చేస్తె పిల్లలు కూడా అదే చేస్తారు. టీ తాగడం పిల్లలకు కూడా మెల్లగా అలవాటు చేస్తారు.అయితే చిన్న పిల్లలు ప్రతిరోజు టీ తాగటం వల్ల వారి శరీరంపై తీవ్ర ప్రభావాలు చూపుతాయి.ఎన్నో అనారొగ్య సమస్యలు కూడా తలెత్తున్నాయట. ఈ విషయాన్ని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది.


ఇందులో  ఉండే కెఫిన్ వారి ఆరోగ్యానికి దుష్పప్రభావాలు కలిగిస్తాయి. ప్రతిరోజు పిల్లలు వీటిని సేవించటం వల్ల వారిలో నిద్రలేమి, ఆందోళన వంటి సమస్యలు పెరుగుతాయి. టీ తాగేచిన్నారుల్లో మెలటోనిన్ ఉత్పత్తి తగ్గటం వలన నిద్ర లేమి సమస్యలు ఎక్కువగా వస్తాయి. తలనొప్పి, తల తిరగడం మొదలైన సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా.. గ్రీన్ టీ వంటి వాటిని 12 ఏళ్ళ లోపు పిల్లలకు అలవాటు చేయకపోవటమే ఉత్తమం. గ్రీన్ టీ ఆకుల్లో పెద్ద మొత్తంలో కెఫిన్, టానిన్, థెయిన్ లు ఉంటాయి. ఇవి చిన్నారుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.


టీ తాగటం వల్ల ఎసిడిటీకి లోనై గ్యాస్ట్రిక్ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉంటాయి. టీలో అధిక మొత్తంలో కెఫిన్ ఉండటం వల్ల పిల్లలు అధిక మూత్రవిసర్జనతో సమస్యలతో బాధపడాల్సి వస్తుంది. టీ అలవాటు చేసుకోవటం వల్ల భవిష్యత్తులో వారి ఎదుగుదలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అనేక సైడెఫెక్ట్స్ ఉత్పన్నమౌతాయి. ఇలా చేయటం వల్ల భవిష్యత్తులో వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు..  అజీర్ణం, తలనొప్పి, మొదలైన సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కొన్నికొన్ని సందర్భాల్లో గుండె సమస్యలు, మానసిక ఆరోగ్య సమస్యలు, బరువు పెరగడం, బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థకు దారితీసే ఛాన్స్ ఉంటుంది.. అందుకే టీ కి పిల్లలను దూరంగా ఉంచాలని అంటున్నారు.పాలను అలవాటు చేయడం మేలు..

మరింత సమాచారం తెలుసుకోండి: