కాళ్ళలో వాపు పెరిగినప్పుడు, నీటిని ఎక్కువగా తాగడం వల్ల కూడా వాపు నుండి ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక నిర్జలీకరణానికి గురైనప్పుడు కూడా కాళ్లు వాపునకు గురవుతాయని చెప్పుకొచ్చారు. అంతేకాక.. గర్భధారణ సమయంలో నీరు ఎక్కువగా తాగడం చాలా ముఖ్యం అని నిపుణులు చెబుతున్నారు.
గర్భధారణ సమయంలో కాళ్లవాపునకు చెక్ పెట్టాలంటే మీరు తీసుకునే ఆహారంలో ఉప్పు తీసుకోవడం తగ్గించాలని చెబుతున్నారు. అంతేకాదు.. మీ పాదాల వాపును తగ్గిస్తుందని అన్నారు. అలాగే ఉప్పు మీ శరీరాన్ని అధికంగా ఉంచడమే దీనికి కారణం అని చెబుతున్నారు. అందుకే అదనపు ఉప్పు తీసుకునే అలవాటు మానేయడం ఉత్తమం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అయితే గర్భధారణ సమయంలో పొటాషియం కంటెంట్ తక్కువగా ఉన్నప్పుడు కాళ్లు వాపునకు గురవుతాయని అన్నారు. ఇక సమయంలో పొటాషియం అధికంగా ఉండే బీన్స్, అరటిపండుతో సహా వివిధ రకాల ఆహారాలను తీసుకోవాలని చెబుతున్నారు. ఇక ప్రెగ్నెసీ సమయంలో కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదని అన్నారు. గర్భిణీలు ఎక్కువగా కాఫీ తాగితే ముందుగా ఆ అలవాటు మానేయాలని చెబుతున్నారు. దాంతో కాళ్లవాపులు రాకుండా జాగ్రత్త పడవచ్చునన్నారు.
అంతేకాదు.. పాదాలకు నూనెతో మసాజ్ చేయడం వల్ల వాపు తగ్గుతుందని చెబుతున్నారు. ఇక పాదాలకు మసాజ్ చేయమని ఇంటి సభ్యులను సంప్రదించండి. అయితే నెమ్మదిగా కాళ్లను నూనెతో మసాజ్ చేస్తే వాపు పరిష్కారం అవుతుందని తెలిపారు. కాగా.. గర్భధారణ సమయంలో ఎడమవైపునకు తిరిగి నిద్రపోవాలని అదే మంచి అలవాటు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.