ఇంట్లో ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని భావిస్తారు. ఆడపిల్ల పుడితే ప్రతి విషయంలోనూ పండగలే.. మగ పిల్లలతో పోలిస్తే అమ్మాయిలు ఇంటికి కళ తెస్తారు.. అందుకే ఆడపిల్ల పుట్టిన తల్లిదండ్రులు.. ఆ అమ్మాయిని అన్ని విధాలుగా ముస్తాబు చేసి మురిసిపోతారు. అయితే.. అమ్మాయిలను పెంచే విషయంలో అబ్బాయిలతో పోలిస్తే కొన్ని అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి.


ఈ కాలంలో ఆడపిల్లలు చాలా తక్కువ వయస్సులోనే రజస్వల అవుతున్నారు. ఇది ఇటీవలి కాలంలో తీసుకుంటున్న ఆహారపు అలవాట్ల కారణంగా ఏర్పడుతుంది. కొందరు చిన్నారులు అయితే మరీ చిన్న వయస్సు అంటే.. 6 నుంచి 8 ఏళ్ల వయస్సులోనే రజస్వల అవుతున్నారు. ఇది అటు చిన్నారులకు.. అటు తల్లిదండ్రులకూ చాలా ఇబ్బందికరమైన సమస్య. మరి దీన్ని ఎలా అధిగమించాలో తెలుసుకుందాం..


ముందు.. అమ్మాయి ఆరు నుంచి 8 ఏళ్లలోపు.. లేదా పదేళ్ల లోపు రజస్వల అయితే ముందు కంగారు పడటం మానేయాలి.. ఆ చిన్నారికి ఇలాంటివి జరుగుతాయని నచ్చజెప్పాలి.. దాన్నో వింతగా భావించడం మానేయాలి.. ఆ విషయం గురించి చిన్నారికి పదే పదే గుర్తు చేయడం మానేయాలి.. చిన్నారి చదువుతున్న పాఠశాలలోనూ ఈ విషయం గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.


ఆ తర్వాత పాపను స్త్రీ నిపుణులైన వైద్యుని వద్దకు తీసుకెళ్లాలి.. ఇలా రజస్వల కావడానికి అనేక కారణాలు ఉంటాయి. అందులో ఏ కారణం చేత పాప త్వరలగా రజస్వల అయ్యిందో.. కొన్ని పరీక్షల తర్వాత వైద్యులు తెలుసుకుంటారు. దానికి తగిన వైద్యం సూచిస్తారు. గతంలో అమ్మాయిలు 12-13 ఏళ్లు వచ్చే వరకూ రజస్వల అయ్యేవారు కాదు.. కానీ ఇప్పుడు కాలం మారింది. ఆహారపు అలవాట్లు కూడా మారాయి.. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. తగిన వైద్యం అందిస్తే.. ఇలా త్వరగా రజస్వల అయినందువల్ల వచ్చే మైనస్ పాయింట్లను సాధ్యమైనంత వరకూ తగ్గించుకోవచ్చు. వైద్య నిపుణుల సాయం తీసుకుని.. చిన్నారికి అండగా నిలవడం వల్ల సమస్యను సాధ్యమైన సాఫీగా పరిష్కరించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: