పుట్టిన బిడ్డతో అమ్మ అని పిలిపించుకోవాలని ప్రతి మహిళ కలలు కంటూ ఉంటుంది. సాధారణంగా ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. వారి హార్మోన్ల మార్పుల వల్ల అనేక రకాల శారీరక, మానసిక సమస్యలు తలెత్తుంటాయి. అలాంటి సమస్యలలో ఒక్కటి గర్భిణులు కాలు వాపు వస్తుంటాయి.

అయితే వాస్తవానికి గర్భధారణ సమయంలో, శిశువు అభివృద్ధి కోసం శరీరం చాలా కష్టపడాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక అలాంటి పరిస్థితిలో శరీరంలో రక్తం, ద్రవాల పరిమాణం పెరగడం వంటివి జరుగుతుంటాయి. దాని కారణంగానే వాపు పాదాలలో మాత్రమే కాకుండా చేతులు, ముఖంతో సహా శరీరంలోని ఇతర భాగాలపై పడుతుందని చెప్పుకొచ్చారు.  

అంతేకాదు.. వారు  కొన్నిసార్లు ఎక్కువసేపు కూర్చోవడం, నిరంతరం నిలబడటం, ఆహారంలో తక్కువ పొటాషియం తీసుకోవడం, కెఫిన్, సోడియం ఎక్కువగా తీసుకోవడం, తక్కువ నీరు తాగడం మొదలైన కారణాల వల్ల కూడా వాపు వస్తుందని చెబుతున్నారు. అయితే కాళ్ళ వాపు నుండి ఉపశనం పొందడానికి ఇలా చేయండి.

అవి ఏంటంటే.. గర్భిణులు నిరంతరం ఒకే స్థితిలో ఉండకుండా.. నిరంతరం నిలబడకూడదు లేదా నిరంతరం కూర్చోకూడదని చెబుతున్నారు. గర్భిణులు కూర్చొని పని చేస్తుంటే, కొంత సేపు నడవాలని చెబుతున్నారు. అలాగే నిరంతరం నిలబడి ఉంటే, కొంచెం సేపు కూర్చుని, ఆపై పని చేయాలని సూచిస్తున్నారు.

అంతేకాదు.. గర్భిణులు ఉప్పు తగ్గించుకోవాలని అంటున్నారు. వారు ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల హై బీపీ వచ్చే ప్రమాదం కూడా ఉందని అంటున్నారు. అలా చేయడం వలన మీకు సంక్లిష్టతలను సృష్టించవచ్చునన్నారు. ఇక పాదాలలో వాపును తగ్గించడానికి మీరు ఇంటి నివారణలను కూడా ప్రయత్నించవచ్చునని అన్నారు. అయితే అందుకోసం గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి అందులో పాదాలను ముంచాలని చెబుతున్నారు.

ఇక గర్భిణులు శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు కూడా శరీరంలో మంట పెరుగుతుందని దానిని నివారించడానికి రోజుకు 7-8 గ్లాసుల నీరు తాగడం ద్వారా శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవాలని చెబుతున్నారు. అంతేకాదు.. సమయం దొరికినప్పుడల్లా కొంత సేపు నడవడానికి సమయాన్ని వెచ్చించాలని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: