సాధారణంగా గర్భధారణ సమయంలో మహిళలు మలబద్ధకం సమస్యతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. అయితే ఈ సమస్యతో బాధపడుతున్న గర్భిణీ మహిళలు రాజ్మా గింజలు తీసుకుంటే మంచిది అని నిపుణులు చెబుతున్నారు. కాగా.. రాజ్మా గింజల్లో ఉన్న 16.5 గ్రాముల పీచు పదార్థం ఆరోగ్యానికి బాగా దోహదపడుతుందని అన్నారు. అంతేకాదు.. మిల్లెట్స్‌లో కంటే డబుల్ పీచు పదార్థం ఈ రాజ్మా గింజల్లో ఉంటుంది.

అయితే 100 గ్రాముల రాజ్మా గింజల్లో 20 గ్రాముల ప్రోటీన్ ఉంటాయని చెబుతున్నారు. ప్రెగ్నెసీ మహిళలకు ప్రొటీన్ అనేది 1కేజీ బరువుకు 2.5గ్రాముల చొప్పున తీసుకుంటూ ఉండాలి. అంతేకాదు.. హై ప్రొటీన్ డైట్ గర్భిణులు ఎక్కువగా తినాలని సూచిస్తున్నారు. లేకుంటే బిడ్డ ఎదుగుదల సరిగ్గా లేకుండా నష్టం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అంతేకాక.. రాజ్మా గింజల్లో 20 గ్రాములు తీసుకుంటే... మేకమాంసం ద్వారా 21 గ్రాములు ప్రొటీన్‌కు సమానంగా ఉంటాయని పేర్కొన్నారు. అయినప్పటికీ వాటి ధరలో రెండింటికి ఎంత వ్యత్యాసమో ఉంటుందో చెప్పనక్కర్లేదు.

ఇక రాజ్మా గింజల్లో ఉండే పొటాషియం 1324 మిల్లీగ్రాములు ఉండగా.. గర్భవతులకు ఫ్లూయిడ్స్ అయి బ్లాలెన్స్ చేయడానికి బాగా పని చేస్తుందని చెబుతున్నారు. అయితే 2500 మిల్లీగ్రాములు ఒకరోజుకు తీసుకోవాలని చెబుతున్నారు. అంతేకాదు.. గర్భిణీలకు నీరు పట్టేస్తుంది కదా.. అది నియంత్రించడానికి కూడా ఇందులో ఉండే హై పొటాషియం దోహదపడుతుంది. ప్రెగ్నెసీ మహిళలకు నెలల పెరిగేకొద్ది కాస్త బీపీ పెరగడం మొదలవుతుంది. ఇక వారి హై బీపీని తగ్గించడానికి వైద్యులు ఇక బీపీ టాబ్లెట్‌ని వాడమని చెబుతుంటాయి. అయితే ఈ బీపీని నియంత్రించడానికి ఇందులో ఉండే హై పొటాషియం దోహదపడుతుంది.

అంతేకాదు.. గర్భిణులకు రాజ్మాగింజలు తీసుకోవడం ద్వారా చాలా లాభాలు ఉన్నాయి. రాజ్మా గింజలను గర్భిణులు 12గంటలు నానపెట్టుకుని ఆపై కుక్కర్లో ఉడకపెట్టుకుని కూరల్లో వేసుకుని వండుకోవాలని చెబుతున్నారు. కాగా..  అన్నం వండేటప్పుడు బియ్యంలో రాజ్మా గింజలు వేయాలని చెబుతున్నారు. దీని వల్ల తీసుకునే ఆహారంలో ప్రోటీన్ శాతం పెరుగుతుందన్నారు. మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటామని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: