వరకట్న చట్టం దారి తప్పుతోంది. చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. పెళ్లయి మూడు రోజులకే అత్తాగారింటి నుంచి బయటకు వెళ్లిపోయిన భార్య, భర్త అతని కుటుంబ సభ్యులపై  వేధింపుల కేసు పెట్టింది. దీనిపై కర్ణాటక హైకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ముఖ్యంగా ఈ కేసును పరిశీలిస్తే వరకట్న నిషేధ చట్టం దుర్వినియోగం కావడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఇంకోటి ఉండదని కోర్టు అభిప్రాయపడింది.


భర్త అతని కుటుంబ సభ్యులపై పెట్టిన క్రిమినల్ కేసులపై స్టే విధించింది. బెంగళూరు బైక్ షోరూం లో ఉంటే యువతీ యువకుడు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. జనవరి 27 న గుడిలో పెళ్లి చేసుకున్నారు. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మరోకరితో వాట్సాప్ లో చాటింగ్ చేయడం, ఆమె అంతకు ముందు వేరొక వ్యక్తి తో ప్రేమ వ్యవహారం నడిపినట్లు భర్తకు తెలిసి నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య వాదనలు మొదలయ్యాయి. దీంతో తెగదెంపులు చేసుకుంటానని బెదిరించిన భార్య..రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్లి చేసుకున్నది కూడా గుర్తు లేదని, మొదటి రోజు జరిగిన శోభనాన్ని అత్యాచారంగా పరిగణించాలని కోర్టులో కేసు వేసింది.


తనకు మరో వ్యక్తితో సన్నిహిత సంబంధం ఉందని తెలుసుకున్న భర్త అతని కుటుంబ సభ్యులు తీవ్ర మనో వేదకు గురి చేశారని, చిత్ర హింసలు పెట్టారని ఆరోపించింది. ఎలాగైనా సరే వారికి శిక్ష పడేలా తీర్పు ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొంది. బాధిత  కుటుంబ సభ్యులు తమను తప్పుడు కేసు నుంచి కాపాడాలని కోర్టులో కేసు వేశారు. దీంతో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.


చట్టాన్ని చాలా మంది ఎంతలా దుర్వినియోగం చేస్తున్నారో ఈ కేసును చూస్తే చాలని వ్యాఖ్యనించింది. ఈ కేసులో తదుపరి తీర్పు వచ్చే వరకు బాధిత కుటుంబ సభ్యులను అరెస్టు చేయరాదని యథాతథాస్థితిని కొనసాగించాలని తీర్పు చెప్పింది. పెళ్లయిన మూడు రోజులకే కోర్టుకీడ్చిందంటే ఆ బాధితుడి బాధ వర్ణానాతీతమనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: