మహిళలు కొంతమంది బరువు తక్కువగా ఉన్నాము అని బాధ పడితే , మరి కొంత మంది బరువు ఎక్కువ ఉన్నాము అని బాధపడుతూ ఉంటారు. ఇకపోతే పెళ్లికి ముందు బరువు తక్కువ ఉన్నవారు కూడా పెళ్లి తర్వాత చాలా లావు అవుతూ ఉంటారు. ఇలా చాలా మంది లో జరుగుతూ ఉంటుంది. దానితో పెళ్లికి ముందు వరకు సన్నగా ఉన్న వ్యక్తులు ఎందుకు బరువు పెరుగుతున్నారు. అతిగా లావు ఎందుకు అవుతున్నారు అని తెలుసుకోవాలి అని అందరికీ ఉంటుంది. సన్నగా ఉండి పెళ్లి తర్వాత లావుగా కావడానికి ప్రధాన కారణాలు అనేకం ఉన్నాయి.

అందులో కొన్ని చూసినట్లు అయితే పెళ్లి కి ముందు అమ్మాయిలు కాలేజీలకు వెళ్లడం , ఉద్యోగం చేయడం ఇలా అనేక పనుల వల్ల కాస్త అలసట ఫీల్ అవుతూ ఉంటారు. ఇక పెళ్లి తర్వాత పెళ్లి కి ముందు ఉన్నంత స్ట్రెస్ ఉండదు. దాని ద్వారా వారు బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే రోజు ఇంట్లో వంట వండుతారు. అలా వండిన వంట ఏమైనా వేస్ట్ అయ్యే అవకాశాలు ఉంటే దానిని పడేయడం ఇష్టం లేని మహిళలు దానిని కూడా తింటూ ఉంటారు. దాని వల్ల కూడా వారు బరువు పెరిగే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. ఇక పెళ్లికి ముందు దాదాపు సన్నగా ఉండడం వల్ల ప్రతి పని ని యాక్టివ్ గా చేస్తూ ఉంటారు. పెళ్లి తర్వాత కాస్త బరువు పెరగగానే బద్ధకం పెరుగుతుంది.

అలా బద్ధకం పెరిగిన కొత్తలోనే ఏదో ఒక పని చేసినట్లు అయితే సన్నగా ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ బద్ధకం వల్ల మరింత రెస్ట్ తీసుకుంటూ పోతే ఆ బరువు మరింతగా క్రమ క్రమంగా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇలా అనేక కారణాల వల్ల పెళ్లి కి ముందు వరకు సన్నగా ఉన్న మహిళలు పెళ్లి తర్వాత లావుగా అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ కొంత మంది మాత్రం పెళ్లి కి ముందు ఆ తర్వాత సన్నగా ఉంటూ వస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: