టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు. కాజల్ అగర్వాల్ కెరియర్ ప్రారంభం నుండే మంచి విజయాలను అందుకుంటు వచ్చింది. దానితో చాలా తక్కువ సమయం లోనే ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరాక కూడా ఈమె ఆదే రేంజ్ లో కెరీర్ను ముందుకు సాగిస్తూ వచ్చింది. ఇకపోతే కెరియర్ను మొదలు పెట్టిన తర్వాత చాలా కాలం వరకు ఈమె తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న యంగ్ స్టార్ హీరోల పక్కన , మీడియం రేంజ్ హీరోల పక్కన నటిస్తూ వచ్చింది.

కానీ సీనియర్ స్టార్ హీరోల పక్కన నటించలేదు. ఇక ప్రస్తుతం ఈమె సీనియర్ స్టార్ హీరోల సినిమాలలో కూడా నటిస్తూ వస్తుంది. అందులో భాగంగా టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు అయినటువంటి చిరంజీవి , బాలకృష్ణ హీరోలుగా నటించిన సినిమాల్లో ఈ బ్యూటీ హీరోయిన్గా నటించింది. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నాగార్జున హీరో గా రూపొందిన ఏ సినిమాలో కూడా కాజల్ అగర్వాల్ ఇప్పటి వరకు నటించలేదు. కానీ నాగార్జున , కాజల్ కాంబోలో రెండు సినిమాలు మిస్ అయినట్లు తెలుస్తోంది.

కొన్ని సంవత్సరాల క్రితం నాగార్జున "రగడ" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో అనుష్క , ప్రియమణి హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ లో ప్రియమణి స్థానంలో మొదట కాజల్ ను అనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ఆఫర్ ప్రియమణి కి వెళ్లిందట. ఇక నాగార్జున హీరోగా రూపొందిన  ది ఘోస్ట్ మూవీ లో కూడా మొదట ఈమెను హీరోయిన్గా అనుకున్నారట. కానీ ఆ తర్వాత ఆ అవకాశం సోనాల్ చౌహాన్ కి వెళ్ళినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: