టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి తన కెరియర్లో చాలా సినిమాలను రిజెక్ట్ చేశాడు. అలా రిజెక్ట్ చేసిన ఓ మూవీలో మోహన్ బాబు హీరోగా నటించగా ఆ సినిమా ద్వారా మోహన్ బాబుకు అద్భుతమైన గుర్తింపు వచ్చింది. మరి చిరంజీవి ఎందుకా సినిమాను రిజెక్ట్ చేశాడు అనే వివరాలను తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం మోహన్ బాబు హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో అల్లుడు గారు అనే మూవీ వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను మొదట రాఘవేంద్రరావు , చిరంజీవితో చేయాలి అనుకున్నాడట. అందులో భాగంగా ఈ సినిమా కథ మొత్తం పూర్తి కాక ముందు చిరంజీవి కి రాఘవేంద్రరావు ఈ మూవీ కథను కొంత భాగం వినిపించి ఈ కథ మొత్తం పూర్తి అయ్యాక మనం సినిమా చేద్దాం అని చెప్పాడట. దానితో చిరంజీవి కూడా మీరు చెప్పిన కథ చాలా బాగుంది. మొత్తం కథ రెడీ చేయండి మనిద్దరం కలిసి ఈ సినిమా చేద్దాం అన్నాడట. ఇక కొంత కాలం తర్వాత రాఘవేంద్రరావు ఒక సారి చిరంజీవికి ఫోన్ చేసి కొంత కాలం క్రితం నీకు ఒక కథ చెప్పాను కదా గుర్తుందా అని అడిగాడట. దానితో చిరంజీవి అవును సార్ గుర్తుంది. కథ మొత్తం పూర్తి అయిందా ఎప్పటి నుండి సినిమా మొదలు పెడదాం అని చిరంజీవి , రాఘవేంద్రరావు అడిగాడట. దానితో రాఘవేందర్రావు ఆ సినిమా నీపై వర్కౌట్ కాదు. ఆ మూవీ క్లైమాక్స్ లో హీరో చనిపోయే సీన్ ఉంటుంది. నీలాంటి స్టార్ హీరో చేస్తే ఆ మూవీ వర్కౌట్ కాదు. అందుకే నేను వేరే హీరోతో ఆ కథతో సినిమా చేయాలి అనుకుంటున్నాను అని చెప్పాడట. దానితో చిరు కూడా ఓకే చెప్పాడట. ఇక రాఘవేంద్రరావు , మోహన్ బాబు హీరోగా అల్లుడు గారు అనే టైటిల్ తో ఆ కథతో మూవీ ని రూపొందించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: