తెలుగు సినీ పరిశ్రమలో డిస్ట్రిబ్యూటర్ గా , నిర్మాతగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో దిల్ రాజు ఒకరు. ఈయన సినిమా ఇండస్ట్రీలో మొదటగా డిస్ట్రిబ్యూటర్ గా కెరియర్ను మొదలు పెట్టాడు. అలా చాలా కాలం పాటు డిస్ట్రిబ్యూటర్ గా కెరియర్ను కొనసాగించిన ఆయన ఆ తర్వాత దిల్ మూవీ తో నిర్మాతగా కెరియర్ను స్టార్ట్ చేశాడు. ఇక నిర్మాతగా అద్భుతమైన స్థాయికి చేరుకున్నాక కూడా దిల్ రాజు మూవీలకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తూ వస్తున్నాడు. ఇకపోతే కొంత కాలం క్రితం దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.

అందులో భాగంగా ఓ ఇద్దరు స్టార్ హీరోల సినిమాల వల్ల తాను చాలా కోట్లు నష్టపోయినట్లు చెప్పుకొచ్చాడు. ఒకానొక ఇంటర్వ్యూలో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ ... నేను 2017 వ సంవత్సరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన అజ్ఞాతవాసి సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను కొనుగోలు చేశాను. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వంలో రూపొందిన స్పైడర్ మూవీ డిస్ట్రిబ్యూషన్ హక్కులను కూడా కొనుగోలు చేశారు. ఈ రెండు మూవీల డిస్ట్రిబ్యూషన్ హక్కులను నేను భారీ ధరకు కొనుగోలు చేశాను.

ఇక ఈ రెండు మూవీలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి అపజయాలను ఎదుర్కున్నాయి. దానితో ఆ రెండు సినిమాల ద్వారా దాదాపు నాకు 25 కోట్ల మేర నష్టం వచ్చింది. కానీ నేను నిర్మించిన చాలా సినిమాలు 2017 వ సంవత్సరం విడుదల అయ్యాయి. అందులో చాలా సినిమాలు మంచి విజయాలు సాధించడంతో ఆ మూవీల ద్వారా నాకు భారీ ఎత్తున లాభాలు వచ్చాయి. దానితో అజ్ఞాతవాసి , స్పైడర్ మూవీలతో వచ్చిన నష్టాలను నేను సొంతగా నిర్మించిన సినిమాల ద్వారా వచ్చిన లాభాలతో పూడ్చుకున్నాడు అని దిల్ రాజు చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: