అక్కినేని నాగార్జున నట వారసులుగా ఇప్పటికే నాగ చైతన్య , అఖిల్ టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. నాగ చైతన్య ఇప్పటికే చాలా సినిమాల్లో హీరో గా నటించగా ... అందులో కొన్ని మూవీలతో మంచి విజయాలను అందుకొని నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఇకపోతే అఖిల్ ఇప్పటికే చాలా సినిమాల్లో హీరోగా నటించాడు. కానీ అందులో ఒక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాను మినహాయిస్తే ఏ మూవీ కూడా ఈయనకు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇలా వరుసగా అపజాలను ఎదుర్కొంటూ వస్తున్న అఖిల్ తాజాగా లెనిన్ అనే మూవీ ని ఓకే చేశాడు.

మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటనను మేకర్స్ కొన్ని రోజుల క్రితమే విడుదల చేస్తూ ఓ వీడియోను కూడా విడుదల చేశారు. ఆ వీడియోకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. అలాగే అఖిల్ మేకవర్ కి కూడా అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. అంతా బాగానే ఉంది కానీ ఓ మూవీ లో శ్రీ లీలను హీరోయిన్గా ఎంపిక చేసుకున్నారు. ఓ వైపు చూస్తే అఖిల్ అనేక ఫ్లాపులతో కెరియర్ను కొనసాగిస్తూ వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తన అందంతో , నటనతో , డాన్స్ తో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్న శ్రీ లీల కి కూడా వరుస పెట్టి ఫ్లాప్ లు వస్తున్నాయి. ఈమె ఇప్పటి వరకు చాలా సినిమాల్లో హీరోయిన్గా నటించినప్పటికీ ఈమెకు అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ విజయం మాత్రం ఇప్పటివరకు దక్కలేదు. ఆయన ఈమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి.

ఇలా అనేక సినిమాల్లో నటించి చాలా అపజయాలను ఎదుర్కొన్న అఖిల్ హీరోగా నటిస్తున్న మూవీలో వరుస అపజయలయో కెరీర్ను కొనసాగిస్తున్న శ్రీ లీల హీరోయిన్గా ఎంపిక కావడంతో అక్కినేని ఫ్యాన్స్ కాస్త ఉన్నట్లు తెలుస్తోంది. కానీ అక్కినేని ఫ్యాన్స్ ఈ మూవీ తో అఖిల్ అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకునే అవకాశం ఉంది అని గట్టిగా నమ్ముతున్నట్లు కూడా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: