టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొన్ని సంవత్సరాల క్రితం రంగస్థలం అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో సమంత హీరోయిన్గా నటించగా ... సుకుమార్మూవీ కి దర్శకత్వం వహించాడు. మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ... జగపతిబాబు , ప్రకాష్ రాజ్మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకొని అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసింది.

మూవీ రామ్ చరణ్ కెరియర్లోనే అదిరిపోయే రేంజ్ విజయం సాధించిన సినిమాల లిస్టులో చేరిపోయింది. ఇక ఈ మూవీలోని రామ్ చరణ్ నటనకు గాను ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రామ్ చరణ్ , బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. జాన్వీ కపూర్ ఈ మూవీ లో హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... శివరాజ్ కుమార్మూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ఇకపోతే ఇప్పటివరకు రామ్ చరణ్ "పెద్ది" సినిమాలో తన పాత్రకు సంబంధించిన 30 శాతం షూటింగ్ను పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ 30 శాతం షూటింగ్ పూర్తి అయ్యే లోపు ఈ మూవీ రంగస్థలం కంటే చాలా బెటర్ గా వచ్చినట్లు మేకర్స్ అభిప్రాయ పడుతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇలా ఈ మూవీ రంగస్థలం కంటే బెటర్ గా వచ్చినట్లు వార్తలు వస్తూ ఉండటంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: