అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన నటీమణులలో ఒకరు అయినటువంటి సమంత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు సినిమాల ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ఈమె ఆ తర్వాత అనేక భాషల సినిమాల్లో నటించి ఇండియా వ్యాప్తంగా గొప్ప గుర్తింపును సంపాదించుకుంది . నటిగా గొప్ప గుర్తింపును సంపాదించుకున్న ఈమె తాజాగా శుభం అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరించింది. సమంత నిర్మించిన సినిమా కావడంతో ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ తాజాగా థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి ప్రస్తుతం మంచి కలెక్షన్లు దక్కుతున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన మూడు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. మరి మూడు రోజుల్లో ఈ సినిమాకు ఎన్ని కలెక్షన్లు వచ్చాయి. ఇంకా ఎన్ని కలెక్షన్లు వస్తే ఈ మూవీ హిట్ స్టేటస్ను అందుకుంటుంది అనే వివరాలను తెలుసుకుందాం.

మూడు రోజుల్లో ఈ సినిమాకు నైజాం ఏరియాలో 52 లక్షల కలెక్షన్లు దక్కగా , ఆంధ్రప్రదేశ్ లో 73 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీ కి మూడు రోజుల్లో 1.25 కోట్ల షేర్ ... 2.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇకపోతే మూడు రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా , ఓవర్సీస్ లలో కలుపుకొని 72 లక్షల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఈ సినిమాకు మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 1.97 కోట్ల షేర్ ... 4 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: