టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు . ఈమె కళ్యాణ్ రామ్ హీరోగా తేజ దర్శకత్వంలో రూపొందిన లక్ష్మీ కళ్యాణం అనే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది . ఈ మూవీ తో ఈమెకు మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమ లో వచ్చింది . ఇక ఆ తర్వాత ఈమె కృష్ణ వంశీ దర్శకత్వం లో రూపొందిన చందమామ సినిమాలో హీరోయిన్గా నటించి అద్భుతమైన కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకుంది . ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన మగధీర సినిమా తో ఇండస్ట్రీ హిట్ ను అందుకుంది. ఈ మూవీ తో ఈమె క్రేజ్ ఒక్క సారిగా పెరిగిపోయింది.

ఆ తర్వాత ఈమెకు స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు రావడంతో అత్యంత తక్కువ కాలంలోనే ఈమె తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఇకపోతే కాజల్ కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా అనేక ఇతర భాష సినిమాల్లో కూడా నటించి ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది. కాజల్ కేవలం సినిమాల్లో హీరోయిన్ పాత్రల్లో ఒక మాత్రమే కాకుండా కొంత కాలం క్రితం జనతా గ్యారేజ్ సినిమాలో ఐటమ్ సాంగ్ లో కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇకపోతే నటిగా ఎన్నో విజయాలను అందుకొని ఎంతో గొప్ప గుర్తింపును సంపాదించుకొని తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ బ్యూటీ కి లేడీ ఓరియంటెడ్ సినిమాల ద్వారా మాత్రం మంచి విజయాలు దక్కడం లేదు. ఇప్పటివరకు అనేక లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించిన కాజల్ కి మంచి విజయం మాత్రం దక్కలేదు. అలా ఎన్నో ప్రయత్నాలు చేసినా లేడీ ఓరియంటెడ్ సినిమాల ద్వారా విజయాలను అందుకోవడంలో కాజల్ వెనుకబడిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: