ప్రస్తుతం మన తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న కొంత మంది హీరోలు వరసగా అపజయాలను ఎదుర్కొంటున్నారు. అలా వరుసగా అపజయాలను ఎదుర్కొంటున్న కొంతమందికి అర్జెంటుగా హిట్ కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే వారి కెరియర్ కష్టాల్లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మరి అర్జెంటుగా హిట్టు కొట్టాల్సిన అవసరం ఉన్న ఆ హీరోలు ఎవరో తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి మాస్ మహారాజా రవితేజ ఈ మధ్య కాలంలో వరుస అపజయాలను ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం రవితేజ "మాస్ జాతర" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ తో ఈయన హిట్ కొట్టకుంటే ఈయన కెరియర్ కష్టాల్లోకి వెళ్లే అవకాశం ఉంది. టాలీవుడ్ ఇండస్ట్రీ లో మాస్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో గోపీచంద్ ఒకరు. గోపీచంద్ కూడా వరుసగా అనేక అపజయాలను అందుకున్నాడు. ఈయన కూడా తన నెక్స్ట్ మూవీ తో మంచి విజయం అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నితిన్ ఒకరు. నితిన్ ఆఖరుగా నటించిన మాచర్ల నియోజకవర్గం , ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ , రాబిన్ హుడ్ సినిమాలు వరుసగా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఈయన ప్రస్తుతం తమ్ముడు సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో ఈయన హిట్ కొట్టాల్సిన అవసరం చాలా వరకు ఉంది. టాలీవుడ్ నటుడు రామ్ పోతినేని కూడా ఈ మధ్య కాలంలో వరుసగా ఫ్లాప్ లను ఎదుర్కొన్నాడు. రామ్ ప్రస్తుతం రాపో 22 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీతో ఈయన కచ్చితంగా హిట్ కొట్టాల్సిన అవసరం ఉంది. ఇక వరుణ్ తేజ్ కూడా వరుసగా ఫ్లాప్ లను ఎదుర్కొంటున్నాడు. ఈయన కూడా నెక్స్ట్ మూవీతో హిట్ కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: