టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తారక్ ఇప్పటివరకు తన కెరీర్లో చాలా సినిమాలను వదులుకున్నాడు. అలా తారక్ వదిలేసిన కొన్ని సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. తారక్ వదిలేసిన సినిమాలలో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు అందుకున్న సినిమాల వివరాలను తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం రవితేజ హీరోగా మీరా జాస్మిన్ హీరోయిన్గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో భద్ర అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. ఇకపోతే ఈ మూవీ కథను మొదట బోయపాటి శ్రీను , తారక్ కి వినిపించాడట. కథ మొత్తం విన్న తారక్ కి ఈ సినిమా కథ పెద్దగా నచ్చలేదట. దానితో ఈ మూవీ కథను తారక్ రిజెక్ట్ చేశాడట. ఆ తర్వాత బోయపాటి శ్రీను , రవితేజ తో ఈ మూవీ ని తెరకెక్కించాడట. కొన్ని సంవత్సరాల క్రితం సిద్ధార్థ్ హీరో గా జెనీలియా హీరోయిన్గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో బొమ్మరిల్లు అనే సినిమా తెరకెక్కిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ కథను భాస్కర్ మొదట సిద్ధార్థ్ కి కాకుండా తారక్ కి వినిపించాడట. కథ మొత్తం విన్న తారక్ స్టోరీ సూపర్ గా ఉంది. కానీ నాపై ఈ కథ వర్కౌట్ కాదు. నా సినిమా అంటే ప్రేక్షకులు యాక్షన్ సన్నివేశాలు , భారీ డైలాగ్స్ ఎక్స్పెక్ట్ చేసి వస్తారు. అవి ఈ కథలో లేవు. అందువల్ల నన్ను పెట్టి ఈ సినిమా తీస్తే ఫ్లాప్ అవుతుంది. వేరే హీరోతో చెయ్యి అని సలహా ఇచ్చాడట. దానితో సిద్ధార్థ్ హీరో గా ఈ మూవీ ని రూపొందించగా ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. తారక్ ఇలా భద్ర , బొమ్మరిల్లు సినిమాలను వదులుకోగా ఆ రెండు మూవీలు కూడా బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: