పవర్ స్టార్ రామ్ చరణ్ ఆఖరుగా గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శంకర్ నిర్మించాడు. ఇకపోతే భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మూవీ కి పెద్ద ఎత్తున నష్టాలు వచ్చినట్లు తెలుస్తుంది. మరి టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి. టోటల్ గా ఈ మూవీ కి ఎన్ని కోట్ల వరకు నష్టం వచ్చింది అనే వివరాలను తెలుసుకుందాం.

టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 19.35 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 10.43 కోట్లు , ఉత్తరాంధ్రలో 10.48 కోట్లు , ఈస్ట్ లో 7.97 కోట్లు , వెస్ట్ లో 4.15 కోట్లు , గుంటూరులో 6.72 కోట్లు , కృష్ణ లో 5.37 కోట్లు , నెల్లూరులో 3.96 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఇక మొత్తంగా ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 68.45 కోట్ల షేర్ ... 105 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి కర్ణాటకలో 4.95 కోట్ల షేర్ ... 10.80 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. తమిళనాడు ఏరియాలో 4.32 కోట్ల షేర్ ... 9.70 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. కేరళ లో 25 లక్షల షేర్ ... 85 లక్షల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 17.45 కోట్ల షేర్ ... 42.55 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఓవర్సీస్ లో 13.5 కోట్ల షేర్ ... 31.85 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 108.92 కోట్ల షేర్ ... 200.70 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ 223 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగగా ... ఈ మూవీ కేవలం 108.92 కోట్ల షేర్ కలెక్షన్లను మాత్రమే వసూలు చేసింది. దానితో ఈ మూవీ కి దాదాపు 114.08 కోట్ల మీరు నష్టాలు వచ్చినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: