తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న నటులలో ఒకరు అయినటువంటి శ్రీ విష్ణు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి అందులో ఎన్నో మూవీలతో మంచి విజయాలను అందుకుని నటుడిగా తనను తాను ఎన్నో సార్లు ప్రూవ్ చేసుకున్నాడు . ఇకపోతే తాజాగా శ్రీ విష్ణు "సింగిల్" అనే సినిమాలో హీరో గా నటించాడు . ఈ మూవీ తాజాగా మంచి అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ పాజిటివ్ టాక్ వచ్చింది.

దానితో ఈ మూవీ కి అద్భుతమైన కలెక్షన్లు ప్రస్తుతం బాక్సా ఫీస్ దగ్గర దక్కుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కూడా కంప్లీట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని లాభాలను అందుకుంటు ఉండడంతో లాంగ్ రన్ లో ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు అనేక మంది అభిప్రాయ పడుతున్నారు. ఇకపోతే ఈ సినిమాకు "యూ ఎస్ ఏ" లో కూడా అద్భుతమైన కలెక్షన్లు దక్కుతున్నాయి.

తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు ఇప్పటివరకు "యూ ఎస్ ఏ" లో 450 కే ప్లస్ కలెక్షన్లు వచ్చినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ మూవీ మరికొన్ని రోజుల్లోనే "యూ ఎస్ ఏ" లో 500 కే కలెక్షన్లను కూడా అందుకనే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sv